ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జూన్ 2022 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ (TEE) దరఖాస్తు ప్రక్రియను పొడిగించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో తెలిపింది. గతంలో టీఈఈ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడానికి జూన్ 5 చివరి తేదీ కాగా, తాజాగా జూన్ 30 వరకు పొడిగించింది. అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో సూచించింది. అలాగే ఒక్కో కోర్సుకు రూ. 200 చొప్పున ఫీజు చెల్లించాలని పేర్కొంది.
టీఈఈ జూన్-2022: దరఖాస్తు విధానం
స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inను సందర్శించాలి.
స్టెప్-2: హోమ్ పేజీలో TEE June 2022 దరఖాస్తు ఫారమ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ప్రొసీడ్ టూ ఫిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌నేషన్ ఫారమ్‌ను క్లిక్ చేయండి
స్టెప్-4: ఫారమ్‌ను పూరించండి. ఆ తరువాత సబ్‌మిట్ చేయండి.
స్టెప్-5: భవిష్యత్తు అవసరాల కోసం ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకోండి
కాగా, టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ జూలై 22న ప్రారంభమై, సెప్టెంబర్ 5న ముగుస్తుంది. హాల్ టిక్కెట్‌లు పరీక్షకు పది రోజుల ముందు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.
విద్యార్థులు ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రంలో వారికి వసతి కల్పించేందుకు యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. ఒకవేళ పరీక్ష కేంద్రంలో సీటింగ్ కెపాసిటీ పూర్తిగా ఫిలప్ అయితే, విద్యార్థి అదే ప్రాంతీయ కేంద్రం పరిధిలోని సమీప/ప్రత్యామ్నాయ పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. కోవిడ్-19 ప్రోటోకాల్స్ లేదా మరేదైనా కారణం వల్ల విద్యార్థులను ఒక పరీక్ష కేంద్రం నుంచి మరొక పరీక్ష కేంద్రానికి మార్చడానికి యూనివర్సిటీకి పూర్తి హక్కు ఉంది.
అసైన్‌మెంట్ గడువు పొడిగింపు
జూన్ టీఈఈ- 2022 కోసం అసైన్‌మెంట్‌లను సమర్పించడానికి గడువును ఇగ్నో యూనివర్సిటీ పొడిగించింది. వీటిని జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయడానికి అవకాశం కల్పించింది. అసైన్‌మెంట్ సమర్పణ సెషన్ ప్రస్తుతం జూన్ 2022 టర్మ్ కోసం నడుస్తోంది. ఇది ప్రాజెక్ట్స్, ఫీల్డ్‌వర్క్ జర్నల్స్, పరిశోధనలు, ఇంటర్న్‌షిప్ నివేదికల కోసం తెరిచి ఉంటుంది. విద్యార్థుల మార్కు షీట్‌లో ఇగ్నో అసైన్‌మెంట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా, అసైన్‌మెంట్ వెయిటేజీ 30 శాతం ఉంటుంది. అసైన్‌మెంట్‌లను సమర్పించకుండా, అందులో ఉత్తీర్ణత సాధించకుండా అభ్యర్థులెవరూ ఇగ్నోలో తమకు నచ్చిన డిగ్రీని పూర్తి చేయడానికి అవకాశం లేదు.
ఇగ్నోలో డిగ్రీ/డిప్లొమా లేదా సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకున్న విద్యార్థులు తమ అసైన్‌మెంట్‌లను ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఇందుకోసం కొరియర్ ద్వారా లేదా ఆఫర్ చేసిన అధ్యయన కేంద్రాన్ని సందర్శించవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో టర్మ్-ఎండ్ అసైన్‌మెంట్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ మోడ్‌ని ఉపయోగించడం ద్వారా అభ్యర్థులకు సమయాన్ని ఆదా చేసే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించింది. ఆన్‌లైన్ అసైన్‌మెంట్ సబ్‌మిట్‌కు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇమెయిల్ లేదా గూగుల్ డాక్యుమెంట్ల ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, IGNOU, JOBS