హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Innovation Award: ఇగ్నో స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు కోసం దరఖాస్తులు.. రూ.10వేలు పొందే అవకాశం..

Innovation Award: ఇగ్నో స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు కోసం దరఖాస్తులు.. రూ.10వేలు పొందే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డ్ 2022 కోసం యూనివర్సిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. ఇందుకోసం ఇగ్నో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డ్ 2022 కోసం యూనివర్సిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. ఇందుకోసం ఇగ్నో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌కు(Registration) చివరి తేదీ సెప్టెంబర్ 30. కొన్ని కొత్త ఆవిష్కరణలు చేసిన విద్యార్థులు ఈ అవార్డు కోసం తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. సూచించిన దరఖాస్తు ఫార్మాట్ అండ్ మార్గదర్శకాలను కళాశాల అధికారిక సైట్‌లో ignou.ac.in చూడవచ్చు. హెల్త్ కేర్ అండ్ బయోమెడికల్ డివైసెస్(Bio Medical Devises), వికలాంగులకు ఇన్నోవేషన్(Innovation), వ్యవసాయం అండ్ గ్రామీణాభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్(Food Processing) మరియు ప్యాకేజింగ్(Packaging), వ్యర్థ పదార్థాల నిర్వహణ, తదితర అంశాల్లో నూతన ఆవిష్కరణలు చేస్తున్న విద్యార్థుల ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో యూనివర్సిటీ(University) ఈ అవార్డును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వెబ్ సైట్లో పొందుపరిచారు.

NABARD Recruitment 2022: నాబార్డ్ లో ఉద్యోగాలు .. డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.. 


వీరిలో ముగ్గురు ఉత్తమ ఆవిష్కరణ విద్యార్థులకు ట్రోఫీ, సర్టిఫికెట్ తో పాటు.. నగదు బహుమతిని అందజేస్తారు. మొదటి ర్యాంకర్‌కు రూ. 10వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.7వేలు, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5 వేలు అందజేస్తారు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులు వారి కెరీర్‌ను కూడా కొనసాగించవచ్చు. వారి కోసం కొత్త మార్గదర్శాకాలను విడదల చేశారు. ఆ చదువుకు సంబంధించి ప్రోత్సాహం కూడా లభిస్తుంది.


ఈ అవార్డు వేడుక ద్వారా.. ఇగ్నో విద్యార్థుల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యం పెరగడంతో పాటు..మంచి నాలెడ్జ్ ను గెయిన్ చేయవచ్చనేది ఇగ్నో ఉద్దేశ్యం.

Prelims Result 2022: ఆ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..


భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో.. యూనివర్సిటీ సైట్‌లో సంగ్రహించిన విధంగా IGNOU ఆవిష్కర్తలు అండ్ ఔత్సాహిక విద్యార్థులను గుర్తించడం.. గుర్తించిన వారికి పూర్తి మద్దతు ఇవ్వడం తమ లక్ష్యం అంటూ పేర్కొన్నారు.

Telangana Jobs: గుడ్ న్యూస్.. పంచాయతీ రాజ్ శాఖలో మరో 529 పోస్టులు మంజూరు..


నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (NCIDE) 2018లో IGNOUలో స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డును ఏర్పాటు చేసింది. అప్పటి నుండి.. ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయం మొదటి మూడు ఆవిష్కర్తలకు అవార్డులను అందజేస్తుంది. దరఖాస్తులను nide@ignou.ac.in ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వర్చువల్ మీడియం ద్వారా ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఫలితాలు ప్రకటించబడిన తర్వాత విజేతలకు ప్రైవేట్‌గా మరియు ఇగ్నో వెబ్‌సైట్ ద్వారా తెలియజేయబడుతుంది. మొదటి మూడు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Degree students, IGNOU, JOBS, Students

ఉత్తమ కథలు