హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఇంటర్ అర్హతతో 200 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

IGNOU Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఇంటర్ అర్హతతో 200 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU)లో 200 జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (JAT) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU)లో 200 జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (JAT) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు IGNOU యొక్క అధికారిక వెబ్‌సైట్ recruitment.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు: 10+2 విద్యార్హతను కలిగి ఉండాలి. కంప్యూటర్‌లో ఇంగ్లీష్‌లో 40 wpm మరియు హిందీలో 35 wpm టైపింగ్ స్పీడ్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IGNOU రిక్రూట్‌మెంట్ కోసం ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం - మార్చి 22

దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ - ఏప్రిల్ 20

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)గా NTA ద్వారా ద్విభాషా (హిందీ/ఇంగ్లీష్) విధానంలో నిర్వహించబడుతుంది. సీబీటీ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులతో ఖాళీల సంఖ్యకు పదిరెట్ల సంఖ్యతో మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు.

టైర్ I CBTలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ (టైపింగ్) పరీక్ష ఉంటుంది. హిందీ లేదా ఆంగ్ల భాషలో ఆ రీక్ష ఉంటుంది ఉంటుంది.

First published:

Tags: Central Government Jobs, IGNOU, JOBS

ఉత్తమ కథలు