Home /News /jobs /

IGNOU RECRUITMENT 2019 INDIRA GANDHI NATIONAL OPEN UNIVERSITY NOTIFICATION FOR VARIOUS POSTS KNOW DETAILS SS

IGNOU Jobs: ఇగ్నోలో 57 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

IGNOU Jobs: ఇగ్నోలో 57 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
(ప్రతీకాత్మక చిత్రం)

IGNOU Jobs: ఇగ్నోలో 57 ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)

IGNOU Recruitment 2019 | ఈ పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది ఇగ్నో. ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్స్ జిరాక్స్ కాపీలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

    ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులతో చేపట్టిన నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా-NVLI ప్రాజెక్ట్‌ కోసం న్యూ ఢిల్లీలోని ఇగ్నో ప్రధాన కార్యాలయంలో 57 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. ఆయా విభాగాల్లో నైపుణ్యం సాధించినవారిని కాంట్రాక్ట్ పద్ధతిలో ఆరు నెలల పాటు నియమించనుంది. ఈ పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది ఇగ్నో. ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్స్ జిరాక్స్ కాపీలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. 2019 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. పలు పోస్టుల భర్తీకి ఇగ్నో జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు, ఇంటర్వ్యూ తేదీలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IGNOU Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 57
    సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 01
    ప్రాజెక్ట్ మేనేజర్- 01
    సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్- 02
    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్- 04
    సీనియర్ వెబ్ డిజైనర్- 01
    వెబ్ డిజైనర్- 01
    ప్రోగ్రామర్- 02
    ప్రాజెక్ట్ అసోసియేట్- 01
    ప్రాజెక్ట్ అసోసియేట్ (లైబ్రరీ సైన్స్)-10
    ప్రాజెక్ట్ అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేటీవ్)- 03
    ట్రైనీ (లైబ్రరీ సైన్స్)- 20
    కంప్యూటర్ ఆపరేటర్- 11

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

    Coal India Jobs: త్వరలో కోల్ ఇండియాలో 9000 ఉద్యోగాల భర్తీ...
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, IGNOU, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు