వివిధ స్ట్రీమ్‌లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU). ఈ సంస్థ 2023-జనవరి సెషన్‌కు సంబంధించి రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ onlinerr.ignou.ac.in ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రీ-రిజిస్ట్రేషన్ సమయంలో సరైన మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనవరి 2023 సెషన్‌కు సంబంధించి రీ-రిజిస్ట్రేషన్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ఇగ్నో యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ప్రోగ్రామ్ గైడెన్స్, పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గతంలో IGNOU కోర్సుల్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ పాత యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి కొత్త కోర్సుల కోసం రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రీ-రిజిస్ట్రేషన్ ప్రాపెస్
అభ్యర్థులు ముందుగా ఇగ్నో యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ onlinerr.ignou.ac.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోని రిజిస్టర్ ఆన్లైన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
-ఆ తరువాత రీ-రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవండి. అనంతరం బేసిక్ రిజిస్ట్రేషన్, లాగిన్ ప్రొసీజర్స్ వివరాలను నింపండి.
-అప్లికేషన్ ఫారమ్‌లో అన్ని వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. చివరకు ఆ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- జనవరి-2023 సెషన్ కోసం ఆన్లైన్లో ఫీజు చెల్లింపు అప్డేట్ కాకపోతే.. వెంటనే రెండోసారి పేమెంట్ చేయవద్దు. ఒక రోజు వరకు వేచి ఉండండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసిన తరువాత, ఆపై నిర్ణయం తీసుకోండి. ఒకే అప్లికేషన్ కోసం రెండు సార్లు ఫీజు చెల్లిస్తే, ఒక పేమెంట్ తిరిగి రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.
ప్రోగ్రామ్స్ వివరాలు
యూజీ ప్రోగ్రామ్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ ఆనర్స్ సైకాలజీ, బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్, బీఏ ఆనర్స్ సోషియాలజీ, బీఏ ఆనర్స్ ఆంత్రోపాలజీ ముఖ్యమైనవి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA (బ్యాంకింగ్, ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) వంటి పీజీ కోర్సులు కూడా ఉన్నాయి.
మరోవైపు, ఇగ్నోలో డిసెంబర్లో జరిగే టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ (TEE) కోసం దరఖాస్తు గడువు ముగిసింది. TEE -2022 కోసం రిజిస్టర్ చేసుకోలేకపోయిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లేట్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు నవంబర్ 16 నుంచి నవంబర్ 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ. 1,100తో పాటు రూ. 200 ఫెనాల్టీ చెల్లించి అప్లై చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IGNOU, JOBS