IGNOU PHD ENTRANCE EXAM PROVISIONAL ANSWER KEY RELEASED HOW TO DOWNLOAD IGNOU NTA AC IN GH VB
IGNOU PhD: ఇగ్నో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరొందిన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన కీ పేపర్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 24న నిర్వహించింది.
దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరొందిన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్‌కు(Entrance Test) సంబంధించిన కీ పేపర్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 24న నిర్వహించింది. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. త్వరలోనే వీటి ఫలితాలను సైతం ప్రకటించనుంది. తాజాగా, ప్రొవిజినల్ ఆన్సర్ కీ(Answer Key), సమాధాన పత్రాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.nta.ac.in నుండి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత ఎన్టీఏ ఫైనల్ కీ విడుదల చేయనుంది. ఫైనల్ కీ విడుదలైన తర్వాత ఫలితాలను వెల్లడించనుంది.
స్టెప్ 2 - అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ చేయండి.
స్టెప్ 3 - ఆన్సర్ షీట్, మీ సమాధాన పత్రాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4 - భవిష్యత్తు సూచనల కోసం జవాబు కీని డౌన్లోడ్ చేసుకోండి.
ఆన్సర్ కీలో అభ్యంతరాలు ఉంటే ఏం చేయాలి?
ఆన్సర్ కీలో ఇచ్చిన ఏదైనా సమాధానాలను సవాలు చేయాలనుకునే అభ్యర్థులు మార్చి 7 నుంచి మార్చి 9 వరకు ఇగ్నోకు మెయిల్ చేయవచ్చు. ఛాలెంజ్‌ని లేవనెత్తడానికి ఒక్కో ప్రశ్నకు రూ. 200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు చేసిన ఛాలెంజ్‌లు, సపోర్టుగా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్(ల) ప్యానెల్ వెరిఫై చేస్తుంది. వారి అభ్యంతరాలు సరైనవేనని తేలితే, ఆన్సర్ కీలో సవరణలు చేస్తారు.
న్యాక్ A++ గుర్తింపు కలిగిన ఓపెన్ యూనివర్సిటీ..
ఇగ్నో కేవలం యూజీ, పీజీ కోర్సులే కాకుండా పీహెచ్డీ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది. వీటికి అదనంగా ఆన్లైన్ కోర్సులు, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్నెస్ లెవల్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇగ్నోను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్‌గా విద్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) A++ గుర్తింపు కూడా లభించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.