హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఇగ్నో అడ్మిషన్స్.. మరోసారి దరఖాస్తు గడువు పెంపు.. పూర్తి వివరాలివే..

IGNOU: ఇగ్నో అడ్మిషన్స్.. మరోసారి దరఖాస్తు గడువు పెంపు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IGNOU: IGNOU డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది. తాజాగా వర్సిటీ రీ-రిజిస్ట్రేషన్ దరఖాస్తుల చివరి తేదీని మరోసారి పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చదువుకు పూర్తి సమయం కేటాయించలేని, తరగతులకు హాజరు కాలేని వారికి చాల ఆప్షన్‌లు ఉన్నాయి. చాలా కళాశాలలు ఆన్‌లైన్‌, దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఒకటి. ఇది డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది. యూనివర్సిటీ ద్వారా దూరవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు తాజాగా యూనివర్సిటీ తీపి కబురు అందించింది. ఆన్‌లైన్, ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌ల కోసం తాజా, రీ-రిజిస్ట్రేషన్ దరఖాస్తుల చివరి తేదీని మరోసారి పొడిగించింది. తాజా అప్‌డేట్‌ల ప్రకారం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ignouadmission.samarth.edu.in ద్వారా మార్చి 27 వరకు ఇగ్నో 2023, జనవరి సెషన్ కోసం అప్లికేషన్‌ను సబ్మిట్ చేయవచ్చు.

* మార్చి 27 వరకు అవకాశం

గతంలో IGNOU యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ గడువు మార్చి 10గా ప్రకటించింది. తరువాత దానిని మార్చి 20కి పొడిగించింది. ఇప్పుడు చివరి తేదీని మరో ఏడు రోజులకు వాయిదా వేసింది. దాంతో ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోని వారికి ఇప్పుడు చేసుకునే సువర్ణ అవకాశం దక్కింది.

సర్టిఫికేట్, సెమిస్టర్ ఆధారిత ప్రోగ్రామ్‌లు మినహా అన్ని ప్రోగ్రామ్‌ల కోసం తాజా అడ్మిషన్లు, రీ-రిజిస్ట్రేషన్ కోసం గడువును ఆన్‌లైన్, దూరవిద్యా విధానం రెండింటికీ పొడిగించినట్లు IGNOU అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆ ట్వీట్ ప్రకారం, అభ్యర్థులు తమ కోర్సుల అడ్మిషన్ కోసం మార్చి 27 వరకు దరఖాస్తు లేదా రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి

* ఇగ్నో జనవరి 2023 సెషన్: ఎలా దరఖాస్తు చేయాలి

మొదటగా IGNOU అఫీషియల్ పోర్టల్‌ ignouadmission.samarth.edu.inకి వెళ్లాలి. హోమ్‌పేజీలో ఉన్న ‘న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌పై క్లిక్ చేయాలి. లేదంటే https://ignouadmission.samarth.edu.in/index.php/registration/user/register లింక్‌పై నొక్కాలి. అవసరమైన రిజిస్ట్రేషన్ వివరాలను అందించి.. పేమెంట్ పూర్తి చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. భవిష్యత్తు కోసం IGNOU 2023 దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* దరఖాస్తు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్

- అభ్యర్థి ఫొటో

- అభ్యర్థి సంతకం

- డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10వ తరగతి మార్క్ షీట్ లేదా బర్త్ సర్టిఫికెట్

- విద్యా అర్హత సర్టిఫికెట్లు

- ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్‌

- కేటగిరీ సర్టిఫికెట్లు (అవసరమైతే)

- BPL సర్టిఫికెట్లు (అవసరమైతే)

IGNOU జనవరి 2023 సెషన్‌కు దరఖాస్తు చేయడానికి ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.

* లేట్ ఫీజు

విద్యార్థులు మార్చి 27 గడువులోపు IGNOU కోర్సుల కోసం నమోదు చేసుకోకుంటే, వారు రూ. 200 ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. అలాగే, SC/ST విద్యార్థులు ఒక ప్రోగ్రామ్‌లో ఫీజు మినహాయింపు లభిస్తుంది. అయితే వారు ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌ల కోసం మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తే , వారి దరఖాస్తును యూనివర్సిటీ తిరస్కరిస్తుంది. అందువల్ల, విద్యార్థులు సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. SC/ST అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ మినహాయింపు కోసం క్లెయిమ్ చేయకూడదు.

First published:

Tags: Career and Courses, EDUCATION, IGNOU, JOBS

ఉత్తమ కథలు