హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Civils Free Coaching: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి ఇగ్నో ఆఫర్.. ఆ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్..

Civils Free Coaching: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి ఇగ్నో ఆఫర్.. ఆ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో).. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది. డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (DACE) సహకారంతో ఎస్సీ విద్యార్థులకు యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ (UPSC) పరీక్ష కోసం ఉచిత కోచింగ్ అవకాశం కల్పిస్తోంది.

ఇంకా చదవండి ...

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU).. సివిల్స్ ప్రిపేర్(Civils Prepare) అవుతున్నవారికి గుడ్ న్యూస్(Good News) చెప్పింది. డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (DACE) సహకారంతో ఎస్సీ విద్యార్థులకు యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ (UPSC) పరీక్ష కోసం ఉచిత కోచింగ్(Free Coaching) అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్(Civil Services Preparation) కోసం ఎస్సీ వర్గానికి చెందిన ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తోంది. సదరు అభ్యర్థులు జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇగ్నో యూనివర్సిటీ నోటిఫికేషన్(IGNOU University Notification) విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కోచింగ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మరిన్ని వివరాలతోపాటు దరఖాస్తు ఫారమ్ లింక్ కోసం అధికారిక వెబ్‌సైట్ dace.ignouonline.ac.inను సందర్శించాలని ఇగ్నో యూనివర్సిటీ సూచించింది.

TSPSC: అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. ఆ వివరాలు నమోదు చేయాలని సూచన

2023 సెషన్ కోసం యూనివర్సిటీ మొత్తం100 సీట్లను ఆఫర్ చేస్తోంది. వీటిలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించింది. ఇగ్నో నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఆధారంగా ఎంట్రెన్స్ టెస్ట్‌ ఉంటుంది. ఈ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.

అర్హత ప్రమాణాలు

దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరయ్యే వారు కోచింగ్ తరగతులు ప్రారంభమయ్యే సమయంలో తమ ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పథకం కేవలం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు మాత్రమేనన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలి.

BJP|TRS : జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మోదీ రాజకీయ సూచనలు .. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

ఇగ్నోతోపాటు ఇతర సంస్థలు

ఇగ్నో యూనివర్సిటీతో పాటు అనేక సంస్థలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు కోచింగ్ అందిస్తున్నాయి. అందులో ప్రధానమైనది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ. ఇది ప్రతి సంవత్సరం సివిల్స్ కోచింగ్ కోసం అన్ని వర్గాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థులను జామియా మిలియా యూనివర్సిటీ ఎంపిక చేయనుంది.

అలాగే దళిత, ఓబీసీ వర్గాల విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్‌ ఇస్తోంది.

Ministry of Defence recruitment 2021: రక్షణ మంత్రిత్వ శాఖలో 458 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

UPSC కోచింగ్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ తీసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ కోచింగ్‌ సదుపాయం పొందవచ్చు. కొన్ని పరీక్షలు రెండు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో, రెండు దశల కోసం రెండుసార్లు ఉచిత కోచింగ్ అందుబాటులో ఉంటుంది. స్థానిక విద్యార్థులకు ప్రతి నెలా రూ.2500, బయటి వారికి రూ.5000 నెలవారీ భత్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్‌ చేసి కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా చెక్కు రూపంలో విద్యార్థులకు అందజేస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Civil Services, IGNOU, UPSC

ఉత్తమ కథలు