దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరొందిన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) రూరల్ డెవలప్మెంట్లో మూడు కొత్త ఆన్లైన్ కోర్సులను(Online Courses) ప్రారంభించింది. సర్టిఫికేట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (CRDOL), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ రూరల్ డెవలప్మెంట్ (MARDOL), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా రూరల్ డెవలప్మెంట్ (PGDRDOL) కోర్సులను ఆవిష్కరించింది. ఇగ్నో డిసిప్లిన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ విభాగం ఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.ignouiop.samarth.edu.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రూరల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ (CRDOL)..
ఈ సర్టిఫికెట్ కోర్సు గ్రామీణ భారతంలోని సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పిస్తుంది. రూరల్ డెవలప్మెంట్లో రెగ్యులర్ కోర్సులు చేయలేని వారికి ఈ స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఆరు నెలల వ్యవధి కలిగి ఉంటుంది. కోర్సు ఫీజు కింద రూ. 1,800 చెల్లించాలి. రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ రూరల్ డెవలప్మెంట్ (MARDOL)..
ఇగ్నో రూరల్ డెవలప్మెంట్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ విద్యార్థులకు గ్రామీణ సమస్యలపై అవగాహన కల్పిస్తుంది. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వివిధ సమస్యలపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. వివిధ ప్రభుత్వ శాఖలు/ఏజెన్సీలు, ఎన్జీఓలు, సహకార సంఘాలు, గ్రామీణ అభివృద్దిలో నిమగ్నమైన సిబ్బందికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. రూరల్ డెవలప్మెంట్ విభాగంలో వృత్తిని కొనసాగించాలనే ఆసక్తి గల తాజా గ్రాడ్యుయేట్లకు కూడా ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కోర్సు మొత్తం వ్యవధి రెండేళ్లు. కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ. 5,900 చెల్లించాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా రూరల్ డెవలప్మెంట్ (PGDRDOL)..
రూరల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ గ్రామీణ సమాజాన్ని ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తుంది. రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, ప్రణాళిక, పర్యవేక్షణ, మూల్యాంకనానికి సంబంధించిన నైపుణ్యాలపై అవగాహన కల్పించడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఈ కోర్సు విద్యార్థులకు పరిశోధన, ప్రాజెక్ట్-వర్క్ ప్రాథమిక అంశాలను కూడా పరిచయం చేస్తుంది. వారికి గ్రామీణ అభివృద్ధి సమస్యలను అధ్యయనం చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ కోర్సు వ్యవధి ఏడాది వరకు ఉంటుంది. కోర్సు ఫీజు కింద రూ. 2,400 చెల్లించాలి. ఇక, రిజిస్ట్రేషన్ ఫీజు కింద దరఖాస్తు సమయంలో రూ. 200 చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, IGNOU, Online course