ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) పేరు తెలియని వారు మన దేశంలో చాలా తక్కువ మందే ఉంటారేమో.. నేరుగా కాలేజీకి వెళ్లి చదువుకోలేని వారికి ఓపెన్, డిస్టెన్స్ పద్ధతుల్లో క్లాసులను చెబుతూ చాలామందిని గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గా నిలిపిన యూనివర్సిటీ ఇది. తాజాగా ఈ యూనివర్సిటీ మరో కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాంను ప్రారంభించింది. డెవలప్‌మెంట్ కమ్యునికేషన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కోర్సును ఇగ్నోలోని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ జర్నలిజం, న్యూ మీడియా స్టడీస్ అందించనుంది. ఈ కోర్సు వ్యవధి సంవత్సరం. ఇందులో అడ్మిషన్ తీసుకోవాలని భావించిన వాళ్లు ignouadmission.samarth.edu.in లింక్ కి వెళ్లి అప్లై చేసే వీలుంది.
HSL Recruitment 2021: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు
BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
ఏ విభాగంలో అయినా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఈ కోర్సు ఫీజు రూ.5000. దీన్ని కోర్సులో చేరే సమయంలోనే మొత్తంగా చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు అదనం. రెండు సెమిస్టర్లలో భాగంగా ఓ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా మానవ అభివృద్ధి, కమ్యునికేషన్, కమ్యునికేషన్ అభివృద్ధిలో మీడియా పాత్ర, డెవలప్‌మెంటల్ జర్నలిజం, సామాజిక మార్పులు, ఇన్ఫర్మేషన్, అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీస్ డెవలప్ మెంట్ వంటి అంశాలు నేర్చుకోవచ్చు. అంతే కాదు.. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సు, రీసెర్చ్ పద్ధతులు ఎంచుకొని ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది.
IBPS RRB 2021: బ్యాంకుల్లో 12,958 జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి
Indian Army Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఈ ప్రాజెక్ట్.. ఏజెన్సీ ప్లానింగ్, డెవలప్‌మెంట్ పద్ధతుల మధ్య ఉన్న ఖాళీని నింపడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. ఇటు అకడమిక్ నాలెడ్జ్ తో పాటు అటు ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా పొందే అవకాశాన్ని ఇస్తోంది ఈ కోర్సు. సామాజిక అభివృద్ధికి సంబంధించిన వివరాలను అందరికీ అర్థమయ్యేలా వివరించనున్నారు. ఈ కోర్సులో 36 క్రెడిట్స్ అందుబాటులో ఉంటాయి. ఐదు థియరీ సబ్జెక్టులు, ఒక ఎలెక్టివ్ కోర్సు ఎంచుకునే వీలుంటుంది. జర్నలిజంలో కమ్యునికేషన్ ప్రాధాన్యతను గుర్తించి ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వైస్ ఛాన్సిలర్ మఖన్ లాల్ చతుర్వేది వెల్లడించారు. ఈ కోర్సు చేసిన వారికి కేవలం లోకల్ గానే కాదు.. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కూడా అవకాశాలు అందనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.