Home /News /jobs /

IGNOU LAUNCHES PG PROGRAM IN ASTROLOGY HERE FULL DETAILS NS GH

IGNOU: జ్యోతిషశాస్త్రంలో మాస్టర్స్​ డిగ్రీ ప్రోగ్రామ్​ను ప్రారంభించిన ఇగ్నో.. దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయమైన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కొత్త కోర్సును ప్రారంభించింది. జ్యోతిషశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్​ను తీసుకువచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరొందిన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కొత్త కోర్సును ప్రారంభించింది. జ్యోతిషశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్​ను ప్రవేశపెట్టింది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (జ్యోతిష్) పేరుతో ఈ ప్రోగ్రామ్​ను దూరవిద్యా విధానంలో అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్​ ద్వారా విద్యార్థులు జ్యోతిషశాస్త్రంలో జ్ఞానం, అభ్యాసాన్ని పెంచుకునే అవకాశం కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్​సైట్​ www.ignouadmission.samarth.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో విశ్వవిద్యాలయం కోరింది. అధికారిక వెబ్​సైట్​లో ప్రోగ్రామ్​కు సంబంధించిన అన్ని వివరాలను పొందుపర్చినట్లు తెలిపింది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్- జ్యోతిష్ కోర్సు రెండేళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సు కేవలం హిందీ భాషలోనే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న ఇతర భాషల వారు సైతం హిందీలోనే కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Apprenticeship Act: అప్రెంటిస్​ చట్టంలో మార్పులకు కేంద్రం కసరత్తు.. పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో బిల్లు.. వివరాలివే
Remote Internships: ఐక్యరాజ్యసమితి రిమోట్ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్... అప్లై చేయండిలా

జ్యోతిష శాస్త్రం ప్రాముఖ్యతపై నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రారంభించినట్లు ఇగ్నో వర్సిటీ పేర్కొంది. ఇటువంటి కోర్సులను భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ కోర్సును రెగ్యులర్​ మోడ్​లో కూడా అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలను తెలుసుకోండి.

ఫీజు వివరాలు..
ఇగ్నో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (జ్యోతిషం) మొదటి సంవత్సరానికి రూ. 6,300 ఫీజు చెల్లించాలి. ఇక, ఈ కోర్సు రిజిస్ట్రేషన్ కోసం రూ. 200 వసూలు చేస్తారు. అదేవిధంగా, రెండో సంవత్సరానికి కూడా రూ. 6,300 ఫీజు చెల్లించాలి. ఇలా రెండేళ్లకు కలిపి ట్యూషన్​ ఫీజు రూపంలో మొత్తం రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 57 ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల్లో ఈ జ్యోతిష్యం కోర్సును అందించనున్నారు. 2021 జూలై సెషన్​కు సంబంధించి ఇగ్నో ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: IGNOU, University exams, University Grants Commission

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు