ప్రముఖ దూరవిద్య కేంద్రం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో సోషల్ వర్క్ (BA Social Work) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ సోషల్ వర్క్(BSW) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కరోనా కారణంగా వర్చువల్‌గానే కోర్సును నిర్వహించనున్నట్లు ఇగ్నో పేర్కొంది. ఈ కోర్సు కోసం 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు ignouiop.samarth.edu.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులకు వృత్తిపరమైన సహాయం అందించేందుకు యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ తోడ్పడుతుందని ఇగ్నో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం కొత్త కోర్సును రూపొందించినట్లు ప్రకటించింది.
"ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా మానవ సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం పెరిగింది. సామాజిక కార్యక్రమాలు మనుషుల మధ్య అంతరాలను తగ్గించగలుగుతాయి. సొసైటీలో మార్పును తీసుకొచ్చేందుకు ఈ కోర్సు తోడ్పడుతుంది" అని ఇగ్నో వివరించింది.
NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
ఈ మేరకు ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎస్.సిద్దె గౌడ, తుమకూరు యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ కే.శేఖర్, ఢిల్లీ యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ సంజయ్ భట్, స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ ఇగ్నో డైరెక్టర్ ప్రొఫెసర్ రోజ్ నెంబియాకిమ్ ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
కొత్త విద్యా విధానం(NEP-2020) మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ సోషల్ వర్క్(BSW) కోర్సు ఉంటుందని ఇగ్నో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు(IGNOU VC) అన్నారు. ఎన్జీఓలు(NGO), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR)తో పాటు.. న్యాయవాద రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు సోషల్ వర్క్‌ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్(BSW) ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
RBI Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
BSW కోర్సు పూర్తిచేసిన వారు.. ఆరోగ్య సంరక్షణ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, విద్య, కౌన్సెలింగ్, కుటుంబం, సామాజిక రక్షణ, మహిళలు, పిల్లలు, మానసిక ఆరోగ్యం వంటి మొదలైన సామాజిక రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. ఇతర సబ్జెక్ట్ నిపుణులు సైతం ఈ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. సామాజిక నైపుణ్యం కలిగిన ఈ ప్రొఫెషనల్ కోర్సును అందిస్తున్న ఇగ్నో స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ ఫ్యాకల్టీ చొరవను అతిథులు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు డా.వి.కన్నప్ప సెట్టి, డాక్టర్. కె. లింగ స్వామి పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.