IGNOU : ఇగ్నోలో సరికొత్త ఎంబీఏ ప్రోగ్రామ్.. ఎంట్రెన్స్ టెస్ట్ లేకుండానే అడ్మిషన్​.. దరఖాస్తు చేసుకోండిలా..!

ఇగ్నో అడ్మిషన్స్

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో ఏటా కొన్ని కోత్త కోర్సులను ప్రారంభిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపుదరఖాస్తు చేసుకోవాలని కోరింది.

  • Share this:








దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో ఏటా కొన్ని కోత్త కోర్సులను ప్రారంభిస్తోంది. ఇగ్నోతాజాగా సరికొత్త ఎంబీఏ ప్రోగ్రామ్ ను ఇగ్నో లాంచ్ చేసింది. ఇగ్నోలోని స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ ఈ కోర్సును లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కోర్సులను ఆల్ ఇండియా కౌన్సిల్​ ఫర్​ టెక్నికల్ ఎడ్యుకేషన్​ (ఏఐసీటీఈ) ఆమోదంతో ప్రారంభించింది. ముందుగా విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జులై 2021 నుంచే ఈ కొత్త కోర్సులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ,కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల.. కోర్సు ప్రారంభం వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపుదరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి, దానికి సంబంధించిన అర్హత, ఇతర వివరాల కోసంhttp://ignou.ac.in/వెబ్ సైట్ కి లాగిన్ అవ్వొచ్చు. ఈ ప్రోగ్రామ్​ను ప్రముఖ విద్యావేత్తలు, ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ రూపొందించారు. సమకాలీన అంశాలతో పాటు.. లేటెస్ట్ కోర్సు మెటిరియల్ ను ఈ ప్రోగ్రామ్ లో చేర్చారు. ఎంబీఏ కోర్సులో భాగంగా.. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ మేనేజ్ మెంట్, ఆపరేషన్స్ మేనేజ్ మెంట్, సర్వీసెస్ మేనేజ్ మెంట్ అనే స్పెషలైజేషన్లు దీనిలో అందుబాటులోఉంటాయి. కోర్సు కాల వ్యవధి కనీసం 2 సంవత్సరాలు ఉంటుంది. గరిష్ఠంగా 4 సంవత్సరాలలో కోర్సును పూర్తి చేయాలి. నాలుగు సెమిస్టర్లలో 28 కోర్సులను విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 116 క్రెడిట్స్ ఉంటాయి. ఇండియాలో ఎక్కడైనా ఇగ్నో సెంటర్లలో ఈ కోర్సుకు ఎన్ రోల్ చేసుకోవచ్చు. కొన్ని సెలెక్ట్ చేసిన ఇతర దేశాల్లోనూ ఈ కోర్సు అందుబాటులో ఉండనుంది.

ఇది చదవండి...MG University: న‌ల్గొండ మ‌హాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాలు

50 శాతం మార్కులతో కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న వారికిడిగ్రీలో 45 శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది. ఈకోర్సులో చేరడానికి ఎటువంటి అర్హత పరీక్ష ఉండదు. దరఖాస్తు చేసుకున్నవాళ్ల అర్హత, సీట్లు, కేటగిరీనిబట్టిఇగ్నోఅడ్మిషన్లు కేటాయిస్తుంది. మరోవైపు,ఇగ్నోకు చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ సెంటర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఐఐబీఎఫ్) తో కలిసి ఎంబీఏ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(ఎంబీఎఫ్) అనే కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు ముంబైలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నిర్వహించే సీఏఐఐబీ పరీక్షను పాస్ అయి ఉండాలి. దానితో పాటు ఏదైనా బ్యాంకింగ్ లేదా ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్ లో కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. 116 క్రెడిట్స్ ఉండే ఈ ప్రోగ్రామ్ మొత్తం 4 సెమిస్టర్లలోఉంటుంది. కనీసం 2 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 4 సంవత్సరాలలో ఈ కోర్సును పూర్తి చేయవచ్చు.








Published by:Krishna Adithya
First published: