హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఇగ్నో జూన్ టీఈఈ 2022 పరీక్షలకు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఇలా అప్లై చేసుకోండి..

IGNOU: ఇగ్నో జూన్ టీఈఈ 2022 పరీక్షలకు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఇలా అప్లై చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సుల కోసం అప్లై చేసుకున్న వారికి అలర్ట్. వర్సిటీ ‘జూన్ 2022 టీఈఈ (టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్)’ పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) కోర్సుల కోసం అప్లై చేసుకున్న వారికి అలర్ట్. వర్సిటీ ‘జూన్ 2022 టీఈఈ (టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్)’ పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును పొడిగించింది. ఇప్పుడు అభ్యర్ధులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో జనవరి 20వ తేదీ లోగా టర్మ్ ఎండ్ ఎగ్జామ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ టీటీఈ ఎగ్జామ్స్ జనవరి 23 నుంచి ఉంటాయి. దీనికి సంబంధించిన డేట్ షీట్‌ను కూడా ఇగ్నో రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 10 వరకు పరీక్షలు కొనసాగుతాయి. అయితే ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులు జనవరి 20 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ కోసం వివిధ దేశాల నుంచి అభ్యర్ధులు దరఖాస్తు చేస్తుంటారు. కాబట్టి ప్రాంతాన్ని బట్టి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. భారతదేశంలో పరీక్షకు హాజరయ్యేవారు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారత్ బయట ఉన్న ఏ దేశంలో పరీక్షకు హాజరు కావాలనుకున్నా 20 డాలర్లు అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఆన్‌లైన్‌లో ఒక్కసారి పేమెంట్ చేసిన తరువాత మళ్లీ రీఫండ్ ఉండదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

* అప్లికేషన్ ప్రాసెస్

అభ్యరథులు ముందు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ను విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లగానే లేటెస్ట్ అలర్ట్‌లో ‘సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫారమ్ ఫర్ జూన్ 2022 ఆఫ్ ఇగ్నో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్’ అని లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ‘ఇంపార్టెంట్ నోట్’ అని ట్యాబ్ హైలైట్ అవుతుంది. అందులో ఉన్న వివరాలను చదివి క్లోజ్ చేయాలి.

తరువాత ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. వివరాలన్నింటినీ సరైన పద్ధతిలో ఎంటర్ చేసిన తరువాతే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసే ముందు దరఖాస్తు ఫారమ్‌ను మరోసారి రీచెక్ చేసుకోవాలి. పేమెంట్ పూర్తి చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత, కన్ఫర్మేషన్ రిసిప్ట్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* ఈ జనవరి సెషన్‌కు అప్లికేషన్స్

వివిధ కోర్సులను ఆన్‌లైన్‌లో అందించే ఇగ్నో.. ప్రతి సంవత్సరం రెండు సార్లు అడ్మిషన్ కోసం దరఖాస్తులను కోరుతుంది. 2023 జనవరి సెషన్‌లో డిగ్రీ, పీజీ, ఇంకా అందుబాటులో ఉన్న కోర్సులను ఆన్‌లైన్ లేదా డిస్టెన్స్‌లో పూర్తి చేయాలనుకునే వారు జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ జాబ్స్‌కు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..

* ఎగ్జామ్స్ ఇలా..

ఎంచుకున్న కోర్సులను బట్టి ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. డిగ్రీ, పీజీ అభ్యర్ధులు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇక డిప్లొమా ఇతర సర్టిఫికెట్ కోర్సులు చేస్తున్న వారికి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, IGNOU, IGNOU TEE, JOBS

ఉత్తమ కథలు