Home /News /jobs /

Exams: ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్​.. ప్రారంభమైన పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. వివరాలివే

Exams: ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్​.. ప్రారంభమైన పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఇందిరా గాంధీ నేషనల్​ ఓపెన్ యూనివర్శిటీ టర్మ్ ఎండ్ ఎగ్జామ్స్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇందిరా గాంధీ నేషనల్​ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU-ఇగ్నో)లో ఓపెన్​ డీగ్రీ కోర్సులు చేస్తున్నారా? అయితే మీకు బిగ్​ అలర్ట్​. జూన్​ 2021 టర్మ్​ ఎండ్​ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు లింక్​ యాక్టివేట్​ చేసింది ఇగ్నో వర్సిటీ. ఈ పరీక్షలు 2021 జూన్​ 15 నుంచి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ టర్మ్-ఎండ్ పరీక్షల షెడ్యూల్​ను వెల్లడిస్తామని ఇగ్నో తన అధికారిక వెబ్​సైట్​లో పేర్కొంది. ఈ పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు తమ దరఖాస్తులను ignou.ac.in వెబ్​సైట్ ద్వారా సమర్పించవచ్చని తెలిపింది. ఈ మేరకు అధికారిక సైట్​లో​ లింక్​ యాక్టివేట్​ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సూచనలు, మార్గదర్శకాలు తెలుసుకుందాం.
Scholarship: కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు స్కాలర్‌షిప్
NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? ఎగ్జామ్ తేదీలు మారుతాయా..? వివరాలివే..

సూచనలు, మార్గదర్శకాలు
ఇగ్నో TEE పరీక్షకు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్​ జారీ అవుతుంది. ఈ పరీక్షలను సాధారణంగా సెప్టెంబర్, ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తారు. అయితే, రెగ్యులర్​ విద్యార్థులతో పాటు గతేడాది ఫెయిల్​ అయిన విద్యార్థులు సైతం టర్మ్​ ఎండ్​ ఎగ్జామ్స్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కరోనా కారణంగా 2020 డిసెంబర్ సెషన్​ ఫలితాలు ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ, మీరు రాసిన పరీక్షలో ఫెయిల్​ అవుతామన్న అనుమానం ఉంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడమే ఉత్తమం అని వర్సిటీ అధికారులు సలహా ఇస్తున్నారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ HYUNDAI MOBIS సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. ఇగ్నో అధికారిక వెబ్​సైట్ ignou.ac.in ను సందర్శించండి.
2. హోమ్​పేజీలోని రిజిస్ట్రేషన్​ లింక్​పై క్లిక్​ చేయండి.
3. సూచనలు చదివి రిజిస్ట్రేషన్​/ రీ రిజిస్ట్రేషన్​ను ఎంపిక చేసుకోండి.
4. మీరు మొదటిసారి నమోదు చేసుకుంటే ‘న్యూ రిజిస్ట్రేరేషన్’ లింక్​పై క్లిక్​ చేయండి. ​

5. అక్కడ అవసరమైన పూర్తి వివరాలు ఫిల్​ చేయండి.​ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోండి. పరీక్షా కేంద్రం కేటాయింపు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ, పరీక్షా కేంద్రంలో సీట్లు ఖాళీ లేకపోతే సమీప పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
6. ఏదైనా బ్యాంకు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫీజు చెల్లించండి. ఒకసారి చెల్లించిన ఫీజు ఎట్టిపరిస్థితుల్లోనూ మరలా తిరిగి తెల్లించబడదు.
7. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత రసీదును ప్రింటవుట్​ తీసుకోండి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Exams, Exams postponed, IGNOU, University exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు