హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU July Admissions: ఇగ్నో జులై సెషన్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

IGNOU July Admissions: ఇగ్నో జులై సెషన్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జూలై 2022 సెషన్ కోసం అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జూలై 2022 సెషన్ కోసం అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఓపెన్ యూనివర్సిటీ అందించే వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్ అయిన ignouadmission.samarth.edu.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31. దీనికి సంబంధించి IGNOU ఒక ప్రకటన విడుదల చేసింది. “2022 జులై ఫ్రెష్ అడ్మిషన్ సైకిల్ ఈరోజు (30/05/2022) నుంచి ప్రారంభమైంది. జూలై 2022 సెషన్ కోసం అడ్మిషన్లకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై 2022,” అని IGNOU ఒక ట్వీట్‌లో పేర్కొంది.

* ఇగ్నో అడ్మిషన్ జూలై 2022 సెషన్ దరఖాస్తు ప్రక్రియ

స్టెప్ 1: IGNOU అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి

స్టెప్ 2: జూలై 2022 అడ్మిషన్ పోర్టల్‌ ఓపెన్ చేసి, 'Click here for new registration' ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్ 3: అవసరమైన వివరాలను నింపి రిజిస్ట్రేషన్ చేసుకోండి.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


స్టెప్ 4: మీ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌కు పంపిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి.

స్టెప్ 5: అప్లికేషన్ ఫారమ్‌లో అన్ని వివరాలను నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 6: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు.

* పీజు మినహాయింపు నిబంధనలు

SC, ST వర్గాలకు చెందిన అభ్యర్థులు ఒక ప్రోగ్రామ్‌కు మాత్రమే ఫీజు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఫీజు మినహాయింపు కోసం ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ ఫారమ్‌లను సబ్‌మిట్ చేస్టే.. వారి అప్లికేషన్స్ అన్నింటినీ ఇగ్నో తిరస్కరిస్తుంది.

* ఇగ్నో అందిస్తున్న కోర్సులు

దేశంలోని సార్వత్రిక విద్యకు ఇగ్నో కేరాఫ్ అడ్రస్‌గా మారింది. డిస్టెన్స్ మోడ్‌లో వివిధ స్ట్రీమ్‌లలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ఇగ్నో అందిస్తుంది. UG ప్రోగ్రామ్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, BA ఆనర్స్ సైకాలజీ, BA ఆనర్స్ పొలిటికల్ సైన్స్, BA ఆనర్స్ సోషియాలజీ, BA ఆనర్స్ ఆంత్రోపాలజీ వంటివి ఉన్నాయి. మాస్టర్స్ ప్రోగ్రామ్‌లలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) వంటివి ఉన్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Distance Education, IGNOU, NewsIGNOU

ఉత్తమ కథలు