దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) (IGNOU). జులై సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువును మరోసారి పొడిగించింది. ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్), ఆన్లైన్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు అక్టోబర్ 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూలై 2022 సెషన్ కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(Indira Gandhi National Open University) మరోసారి పొడిగించింది. ఇంతకు ముందు జూలై సెషన్ 2022(July Session 2022) కోసం రీ-రిజిస్ట్రేషన్(Re Registration) కోసం చివరి తేదీ 22 అక్టోబర్ 2022గా ఉండేది. తాజాగా దీనిని అక్టోబర్ 27, 2022గా మరోసారి పొడిగించారు. IGNOU సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో రీ-రిజిస్ట్రేషన్ పొడిగించిన తేదీ (IGNOU జూలై 2022 Re-Registration) గురించి సమాచారాన్ని అందించింది. అభ్యర్థులు ignouadmission.samarth.edu.inఅధికారిక వెబ్సైట్లో ఇగ్నోలో అడ్మిషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు..
IGNOU తన అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించి నోటీసును కూడా జారీ చేసింది. మరింత సమాచారం కోసం.. అభ్యర్థులు జారీ చేసిన నోటీసును తనిఖీ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం.. అభ్యర్థి రూ. 250 రుసుము చెల్లించాలి. దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. SC/ST కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించబడింది. రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించబడదు. అడ్మిషన్ సమయంలో మొదటి సెమిస్టర్/సంవత్సరానికి ప్రోగ్రామ్ ఫీజుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును జమ చేయడం తప్పనిసరి.
మరో సెమిస్టర్ కు అనుమతి..
యూనివర్సిటీలోని ఏదైనా కోర్సులో ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అభ్యర్థులు తదుపరి సెషన్లో తమ అధ్యయనాలను కొనసాగించాలనుకుంటే చివరి తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అదనంగా.. ప్రస్తుతం విశ్వవిద్యాలయం అందించే ఏదైనా కోర్సులు అండ్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు గడువు కంటే ముందే రీ-ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుదారులు తిరిగి నమోదు ప్రక్రియను పూర్తి చేయకుండా తదుపరి సెమిస్టర్‌కు ఏ అభ్యర్థిని అనుమతించరని గమనించాలి.
ఇగ్నోలో కేవలం ఆన్లైన్ కోర్సులే కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్నెస్ లెవల్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇగ్నోను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్‌గా విధ్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇగ్నో ఇచ్చే డిస్టన్స్ కోర్సు సర్టిఫికెట్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఈ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) A++ గుర్తింపు లభించింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ www.ignou.ac.in ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ‘ఆన్లైన్ రిజిస్ట్రేషన్’ మెనూలోకి వెళ్లి, ‘ఫ్రెష్ అడ్మిషన్’ను ఎంచుకోండి.
- మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నట్లైతే లాగిన్ చేయడానికి మీ పేరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
- అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- ఆ తర్వాత రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- మీ దరఖాస్తును సమర్పించి భవిష్యత్తులో అవసరం కోసం దరఖాస్తు ఫారమ్‌ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IGNOU, JOBS, NewsIGNOU