IGNOU July Admission: ఇగ్నో జూలై సెషన్​ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 25 వరకు అవకాశం

ఇగ్నోలో కోర్సుల దరఖాస్తుకు గడువు పెంపు.. (ప్రతీకాత్మక చిత్రం)

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో).. జులై సెషన్​కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ గడువును మరోసారి పొడిగించింది. ఆన్​లైన్​ డిస్టెన్స్​ లెర్నింగ్​(ఓడీఎల్​), ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

  • Share this:
దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) (IGNOU).. జులై సెషన్​కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ గడువును మరోసారి పొడిగించింది. ఆన్​లైన్​ డిస్టెన్స్​ లెర్నింగ్​(ఓడీఎల్​), ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అభ్యర్థులు www.ignou.ac.in, www.ignouadmission.samarth.edu.in వెబ్​సైట్ల ​ద్వారా ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని కోరింది. అదే పోర్టల్​ ద్వారా రూ. 200 అప్లికేషన్​ ఫీజు కూడా చెల్లించవచ్చని తెలిపింది. వాస్తవానికి ఈ రిజిస్ట్రేషన్​ గడువు అక్టోబర్​ 11తో ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరో రెండు వారాలు పొడిగిస్తూ ఇగ్నో నిర్ణయం తీసుకుంది.

* ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్​ www.ignou.ac.in ని సందర్శించండి.

- హోమ్​ పేజీలో అందుబాటులో ఉన్న ‘ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్​’ మెనూలోకి వెళ్లి, ‘ఫ్రెష్ అడ్మిషన్’ను ఎంచుకోండి.

- మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నట్లైతే లాగిన్ చేయడానికి మీ పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.

- ఆ తర్వాత రిజిస్ట్రేషన్​ లింక్​పై క్లిక్​ చేసి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

- అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

- ఆ తర్వాత రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

- మీ దరఖాస్తును సమర్పించి భవిష్యత్తులో అవసరం కోసం దరఖాస్తు ఫారమ్‌ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇగ్నోలో కేవలం ఆన్​లైన్​ కోర్సులే కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్​, మాస్టర్స్​ డిగ్రీ ప్రోగ్రామ్​, డిప్లొమా, సర్టిఫికెట్​ కోర్సులు, అవేర్​నెస్​ లెవల్​ ప్రోగ్రామ్స్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇగ్నోను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్​గా విధ్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇగ్నో ఇచ్చే డిస్టన్స్​ కోర్సు సర్టిఫికెట్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఈ యూనివర్సిటీకి నేషనల్​ అసెస్​మెంట్​ అండ్​ అక్రిడేషన్​ కౌన్సిల్​ (న్యాక్​) A++ గుర్తింపు లభించింది.
Published by:John Naveen Kora
First published: