ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జూలై 2022 అన్ని కోర్సుల రీ-రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. ఇంతకుముందు ఈ తేదీ జూలై 15 వరకు ఉండేది. ప్రస్తుతం ఆ గడువును జూలై 31 వరకు పొడిగించింది. యూనివర్సిటీ IGNOU జూలై 2022 రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను మే 20 నుండి ప్రారంభించింది. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమర్పించిన 30 రోజుల తర్వాత అభ్యర్థులు ఇగ్నో రీ-రిజిస్ట్రేషన్ స్టేటస్ ను చూసుకోవచ్చు. IGNOU రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించకుండా తర్వాత జరిగే సెమిస్టర్ కు లేదా విద్యా సంవత్సరంలో ఏ విద్యార్థికి ప్రవేశం ఉండదు.
AP Mega Job Mela: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..
యూనివర్సిటీలోని ఏదైనా కోర్సులో ఇప్పటికే ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అభ్యర్థులు తదుపరి సెషన్లో తమ అధ్యయనాలను కొనసాగించాలనుకుంటే చివరి తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం అందించే ఏదైనా కోర్సులు మరియు ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు గడువు కంటే ముందే రీ-ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుదారులు రీ రిజస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే.. తర్వాత జరిగే ఏ పరీక్షలకు అనుమతి ఉండదు.
దీనికి సంబంధించి తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఇగ్నో చివరి తేదీని వాయిదా గురించి తెలియజేసింది. "జూలై 2022 @OfficialIGNOUకి రీ-రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగింపు" అని ట్వీట్ చేసింది.
Extension of Last date of Re-Registration July 2022@OfficialIGNOU pic.twitter.com/NPgpUmahNU
— IGNOU Regional Centre Rajkot (@IGNOU_RC_Rajkot) July 18, 2022
రీ-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి
Step 1: ముందుగా, అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్సైట్ https://onlinerr.ignou.ac.in/కి వెళ్లండి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2: ఇప్పుడు అభ్యర్థి రీ-రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
Step3: అభ్యర్థులు వారి నమోదు ID అండ్ కోడ్‌ను నమోదు చేయాలి.
Step 4: ఆ తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫీజును సమర్పించాలి.
Step5: అభ్యర్థులు చివరిగా ఆ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి
Step 6: దానిని ప్రింట్ అవుట్ తీసుకిని.. తదుపరి అవసరాల కొరకు దగ్గరు ఉంచుకోవాలి.
కొన్ని సూచనలు..
రిజిస్ట్రేషన్ లో సరైన మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడిని ఇవ్వాలి.
ఆన్లైన్ ఫీజులు చెల్లించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కార్డ్ వివరాలను లేదా OTPని ఎవరితోనూ పంచుకోవద్దు. BHIM యాప్‌తో సహా UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు. అయితే అంతర్జాతీయ విద్యార్థులు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ చెల్లింపు ఎంపికలను ఉపయోగించవచ్చు. ఆన్లైన్ చెల్లింపు అప్డేట్ కాకపోతే.. రెండవ చెల్లింపును మళ్లీ చేయవద్దు. దయచేసి.. ఒక రోజు వేచి ఉండి మరుసటి రోజు చెల్లింపు స్టేటస్ ను చూసుకొని ఆపై కొనసాగాలి. ఒకవేళ మీరు ఒకే దరఖాస్తుకు రెండు సార్లి ఫీజు చెల్లిస్తే.. రెండో ఫీజు చెల్లింపు డబ్బులు తిరిగి రిటర్న్ వచ్చేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IGNOU, IGNOU TEE, JOBS, NewsIGNOU