Home /News /jobs /

IGNOU July 2021: ఇగ్నో జులై సెషన్ రిజిస్ట్రేషన్ గడువు మ‌ళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

IGNOU July 2021: ఇగ్నో జులై సెషన్ రిజిస్ట్రేషన్ గడువు మ‌ళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

IGNOU July 2021: దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో-IGNOU) జూలై సెషన్​కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించింది. ఆన్‌లైన్ (Online) డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ (Online Program)లు, ఇతర కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబ‌ర్ 7, 2021 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.

ఇంకా చదవండి ...
    దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో-IGNOU) జూలై సెషన్​కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించింది. ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, ఇతర కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబ‌ర్ 7, 2021 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇగ్నో అధికారిక వెబ్‌సైట్- ignou.ac.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇగ్నో (IGNOU) వాస్తవానికి వివిధ ఆన్​లైన్​ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తొలుత జులై 30 వరకే గడువు ఇచ్చింది. కరోనా కారణంగా న‌వంబర్‌ 30 వరకు గడువు పొడిగించింది. అయితే, ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    కేవలం ఆన్​లైన్​ కోర్సుల (Online courses)కే కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్​నెస్​ లెవల్​ ప్రోగ్రామ్స్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్​లో పొందుపర్చిన వివరాలను పరిశీలించాలని ఇగ్నో సూచించింది.

    Railway Apprentice: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హత‌తో రైల్వే ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


    ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    1. ఇగ్నో అధికారిక వెబ్‌సైట్-www.ignou.ac.in కి వెళ్లండి.

    2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సమర్త్​ పోర్టల్​ లింక్​పై క్లిక్​ చేయండి. ఈ లింక్​ ద్వారా జూలై 2021 సెషన్ పీజీ, యూజీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లింక్​ డిసెంబ‌ర్ 7 వరకు యాక్టివ్​లో ఉంటుంది.

    Indian Navy Jobs: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో నేవీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం


    3. ఆన్​లైన్​ డిస్టన్స్​ లెర్నింగ్​ ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకునేందుకు www.ignouadmission.samarth.edu.in పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల కోసం అయితే www.ignouiop.samarth.edu.in పై క్లిక్ చేయాలి.

    DCCB Recruitment 2021: ఐదు జిల్లాల్లో బ్యాంక్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌,


    4. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

    5. వెంటనే ఫీజు చెల్లింపు విండో ఓపెన్​ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీంతో, దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

    న్యాక్ A ++ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్​ యూనివర్సిటీ..

    ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్​గా విద్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. వారు డిస్టన్స్​లో కోర్సులను అభ్యసించి సర్టిఫికెట్​ పొందవచ్చు. డిస్టన్స్​, ఆన్​లైన్​ కోర్సులతో పాటు విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కూడా ఇస్తుంది. ఈ యూనివర్సిటీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్​) A ++ గుర్తింపు లభించింది. భారత్​లో ఈ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో కావడం విశేషం.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: EDUCATION, IGNOU, Online Education, Students

    తదుపరి వార్తలు