Home /News /jobs /

IGNOU JULY 2021 APPLICATION FOR ODL ONLINE PROGRAMMES EXTENDED APPLY BY SEPTEMBER 23 GH SK

IGNOU July 2021: ఇగ్నో జులై సెషన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

ఇగ్నో అడ్మిషన్స్

ఇగ్నో అడ్మిషన్స్

IGNOU July 2021: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్​గా విద్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు.

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో-IGNOU) జూలై సెషన్​కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించింది. ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, ఇతర కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 23 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇగ్నో అధికారిక వెబ్‌సైట్- ignou.ac.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇగ్నో (IGNOU) వాస్తవానికి వివిధ ఆన్​లైన్​ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తొలుత జులై 30 వరకే గడువు ఇచ్చింది. కరోనా కారణంగా సెప్టెంబర్​ 15 వరకు గడువు పొడిగించింది. అయితే, ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కేవలం ఆన్​లైన్​ కోర్సుల (Online courses)కే కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్​నెస్​ లెవల్​ ప్రోగ్రామ్స్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్​లో పొందుపర్చిన వివరాలను పరిశీలించాలని ఇగ్నో సూచించింది.

JEE Main paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 రిజల్ట్స్ ఎప్పుడు? ఎలా చెక్ చేసుకోవాలి?

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. ఇగ్నో అధికారిక వెబ్‌సైట్-www.ignou.ac.in కి వెళ్లండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సమర్త్​ పోర్టల్​ లింక్​పై క్లిక్​ చేయండి. ఈ లింక్​ ద్వారా జూలై 2021 సెషన్ పీజీ, యూజీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లింక్​ సెప్టెంబర్ 23 వరకు యాక్టివ్​లో ఉంటుంది.

CTET 2021: ఈసారి సీటెట్ ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో.. సెప్టెంబ‌ర్ 20 నుంచి ద‌ర‌ఖాస్తులు

3. ఆన్​లైన్​ డిస్టన్స్​ లెర్నింగ్​ ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకునేందుకు www.ignouadmission.samarth.edu.in పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల కోసం అయితే www.ignouiop.samarth.edu.in పై క్లిక్ చేయాలి.

4. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

5. వెంటనే ఫీజు చెల్లింపు విండో ఓపెన్​ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీంతో, దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

న్యాక్ A ++ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్​ యూనివర్సిటీ..

IT Jobs: ఐటీ రంగంలో ఉద్యోగాల జాతర.. ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు, బోనస్​లు..

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్​గా విద్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. వారు డిస్టన్స్​లో కోర్సులను అభ్యసించి సర్టిఫికెట్​ పొందవచ్చు. డిస్టన్స్​, ఆన్​లైన్​ కోర్సులతో పాటు విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కూడా ఇస్తుంది. ఈ యూనివర్సిటీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్​) A ++ గుర్తింపు లభించింది. భారత్​లో ఈ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో కావడం విశేషం.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: EDUCATION, IGNOU, Online Education

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు