IGNOU Admissions: ఇగ్నో జులై సెషన్​ రిజిస్ట్రేషన్​ గడువు పొడిగింపు.. నెలాఖరు వరకు నమోదుకు అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జులై 2021 సెషన్‌కు సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తు గడువు పొడిగించింది.

  • Share this:
దేశంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జులై 2021 సెషన్‌కు సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 30 వరకు ఆన్​లైన్​లో రీ రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న దరఖాస్తు గడువు ముగిసింది. అయితే, కరోనా నేపథ్యంలో రీ-రిజిస్ట్రేషన్ల గడువు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రీ-రిజిస్ట్రేషన్​ ప్రక్రియ, మరిన్ని వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్​సైట్​ www.ignou.ac.in ను సందర్శించాలని తెలిపారు.
Fellowship: అర్బన్​ లీడర్స్​ ఫెలోషిప్ ప్రారంభించిన ప్రభుత్వం.. ఎంపికైతే నెలకు రూ. 1.25 లక్షలు.. వివరాలివే
Telangana: సీటు ఎక్కడొచ్చినా.. క్లాసులు మాత్రం నచ్చిన కాలేజీలో వినొచ్చు.. తెలంగాణలో సరికొత్త ప్రయోగం

రీ - రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది?
రీ- రిజిస్ట్రేషన్ అనేది అభ్యర్థి ఎంచుకున్న కోర్సు తర్వాతి సంవత్సరం లేదా సెమిస్టర్ కోసం నమోదు ప్రక్రియను సూచిస్తుంది. రెండు లేదా మూడేళ్ల కాలానికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సెమిస్టర్ ఆధారిత ప్రోగ్రామ్స్​లో చేరిన విద్యార్థులకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఫైనల్ టర్మ్ ఎండ్ పరీక్షకు హాజరవ్వడం, గత సెమిస్టర్‌కు సంబంధించిన అసైన్మెంట్లు సమర్పించడంతో సంబంధం లేకుండానే అభ్యర్థులు వచ్చే ఏడాది లేదా సెమిస్టర్​కు తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి?
ముందు www.Ignou.ac.in ఇగ్నో అధికారిక సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇగ్నో సమర్త్ పోర్టల్ లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ వివరాలను నింపేందుకు కొత్త కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
దరఖాస్తు ఫారమ్​లో అవసరమైన అన్ని వివరాలు నింపండి. ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లింపు పూర్తి చేయండి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్​లో అప్​లోడ్​ చేయాలి.
ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, సబ్​మిట్​పై క్లిక్ చేయండి.

కాగా, దేశంలో దూర విద్యను బోధించే విద్యా సంస్థల్లో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్రధానమైనది. ఈ వర్సిటీ నుంచి పొందే పట్టాకు ఎంతో గుర్తింపు ఉంటుంది. భారత్​లో ఎంతో మంది గృహిణులు, విద్యార్థులు సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి వివిధ కోర్సుల్లో పట్టా పొందుతున్నారు. ఇగ్నో వర్సిటీ ప్రతి ఏడాది జూన్​, జులై నెలల్లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.
Published by:Nikhil Kumar S
First published: