IGNOU JULY 2021 ADMISSION DEADLINE FOR IGNOU JULY SESSION ENDING TOMORROW KNOW PROCESS AND DETAILS EVK
IGNOU July 2021: రేపటితో ముగియనున్న ఇగ్నో జూలై సెషన్ ప్రవేశాల గడువు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
IGNOU July 2021: దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో-IGNOU) జూలై సెషన్‌కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించింది. ఆన్లైన్ (Online) డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ (Online Program)లు, ఇతర కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.
దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University) జూలై 2021 సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ (Post Graduate) ప్రోగ్రాముల్లో చేరేందుకు డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అంటే రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తుల సమర్పణ తేదీ డిసెంబర్ 7వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి రిజిస్ట్రేషన్ (Registration) గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్సైట్ www.ignou.ac.in ద్వారా జూలై 2021 సెషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇగ్నో జూలై 2021 సెషన్ దరఖాస్తు విధానం
ఇగ్నో జూలై 2021 సెషన్లో రిజిస్ట్రేషన్ కొరకు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ (Online)లో ఉంటుందని విద్యార్థులు గమనించాలి. ఈ కింది స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా అభ్యర్థులు ఇగ్నో జూలై 2021 సెషన్ దరఖాస్తులను పూర్తి చేయవచ్చు.
జులై సెషన్ అడ్మిషన్స్ కోసం ఇగ్నో (IGNO) ఇప్పటికే తుది గడువును చాలాసార్లు పొడిగించింది. ఇటీవల ఈ తేదీని డిసెంబర్ 15 వరకు పెంచారు. అయితే మరోసారి గడువు పెంచే అవకాశాలు లేవని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇగ్నోలో కేవలం యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లే కాకుండా ఆన్లైన్ కోర్సులు, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్నెస్ లెవల్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలను కూడా ఇగ్నో నిర్వహిస్తోంది.
న్యాక్ A ++ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్ యూనివర్సిటీ..
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. ఆర్థిక, కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో రెగ్యులర్‌గా విద్యనభ్యసించలేని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. వారు డిస్టన్స్‌లో కోర్సులను అభ్యసించి సర్టిఫికెట్ పొందవచ్చు. డిస్టన్స్, ఆన్లైన్ కోర్సులతో పాటు విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కూడా ఇస్తుంది. ఈ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) A ++ గుర్తింపు లభించింది. భారత్‌లో ఈ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో కావడం విశేషం.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.