హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఇగ్నో ఉద్యోగాలు.. JAT రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..

IGNOU: ఇగ్నో ఉద్యోగాలు.. JAT రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు IGNOU గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ అర్హతతో భారీ స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

IGNOU: ప్రస్తుత రియల్ వరల్డ్ అవసరాలకు తగ్గట్టు ఆన్‌లైన్‌లో అకడమిక్, సర్టిఫికేట్ కోర్సులను అందించే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ అర్హతతో భారీ స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనుంది. ఈ మేరకు జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్ -2023 రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ‌ను ఎన్‌టీఏ మార్చి 22 నుంచి ప్రారంభించింది. దరఖాస్తుకు తుది గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాలను పరిశీలిద్దాం.

జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్(JAT)-2023 రిక్రూట్‌మెంట్ కోసం అర్హలైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ recruitment.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎన్‌టీఏ మొత్తం 200 జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి, వారు 10+2 లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 వర్డ్స్, హిందీలో 35 వర్డ్స్‌గా ఉండాలి.

* ఏప్రిల్ 21-22 మధ్య ఎడిట్ విండో ఆప్షన్

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత ఏప్రిల్ 21న అప్లికేషన్ ఎడిట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ సమయంలో అప్లికేషన్‌లో కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, అప్లికేషన్ ఎడిట్ విండో ఆప్షన్ ఏప్రిల్ 22న ముగియనుంది.

* ఎంపిక ప్రక్రియ

జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్(JAT)-2023 రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ త్వరలో విడుదల చేయనుంది. ఎగ్జామ్ సెంటర్స్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ తదితర వివరాలను ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో అందుబాటులో ఉంచింది. ఇన్ఫర్మేషన్ బులిటెన్‌ సమాచారం ignoujat.nta.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.

Trending: 55వేల ఏళ్లనాటి ఉల్కతో పర్స్..మీరు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయొచ్చు!

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందు అధికారిక పోర్టల్ ignoujat.nta.ac.in ను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలో ‘న్యూ రిజిస్ట్రేషన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ కోసం పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎంటర్ చేయండి.

- రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు ఎంటర్ చేసిన ఇమెయిల్ ID, మొబైల్ నంబర్‌కు ఇమెయిల్, SMS వస్తుంది. ఆ తరువాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

- ఫారమ్‌లో వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు వంటి వివరాలను నింపాలి. తరువాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

- అప్లికేషన్ రివ్యూ తరువాత ఫీజు చెల్లించండి. అనంతరం అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోండి.

https://www.news18.com/education-career/ignou-jat-2023-registration-begins-how-to-apply-2-7375867.html

First published:

Tags: CAREER, Career and Courses, JOBS

ఉత్తమ కథలు