IGNOU JANUARY 2022 SESSION RE REGISTRATION DATES EXTENDED TILL JANUARY 31 IGNOU AC IN IGNOU SAMARTH EDU IN GH VB
IGNOU: ఇగ్నో జనవరి 2022 సెషన్ రీ-రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జనవరి 2022 సెషన్‌కు సంబంధించిన రీరిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో(Online) సబ్మిట్ చేసేందుకు జనవరి 31 వరకు అవకాశం కల్పించింది.
దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జనవరి 2022 సెషన్‌కు సంబంధించిన రీరిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో(Online) సబ్మిట్ చేసేందుకు జనవరి 31 వరకు అవకాశం కల్పించింది. దీంతో, వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ (పీజీ సర్టిఫికేట్), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGD), సర్టిఫికేట్, డిప్లొమా ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే వారు నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్లు ignou.samarth.edu.in,- www.ignou.ac.in ద్వారా ఇగ్నో జనవరి 2022 సెషన్‌కు రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇగ్నో కోర్సులను అభ్యసిస్తున్నవారు తదుపరి సంవత్సరం లేదా సెమిస్టర్ కోసం రీరిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు ఇగ్నో సర్వీస్ సెంటర్ హెల్ప్‌లైన్ ఈ–మెయిల్ ఐడి, కాంటాక్ట్ నంబర్లను కూడా అందించింది. కోర్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇగ్నో స్టూడెంట్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. హెల్ప్ లైన్ సర్వీస్‌లు ssc@ignou.ac.in, 011-29572513, 29572514 కాంటాక్ట్ నంబర్ల ద్వారా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక, రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ విభాగాన్ని సంప్రదించవచ్చు. csrc@ignou.ac.in, 011-29571301, 29571528 ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
మీ ప్రాథమిక వివరాలతో ఎంచుకున్న కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా ఇతర వివరాలను ఉపయోగించి మళ్లీ లాగిన్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
రూ. 200 దరఖాస్తు రుసుమును చెల్లించండి. ఆ తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయండి.
భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఇగ్నో కేవలం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లే కాకుండా ఆన్లైన్ కోర్సులు, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్నెస్ లెవల్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. వీటితో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.