హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఇగ్నోలో ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో ఎంఏ చేసే అవకాశం.. కోర్సు పూర్తి వివరాలు మీ కోసం

IGNOU: ఇగ్నోలో ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో ఎంఏ చేసే అవకాశం.. కోర్సు పూర్తి వివరాలు మీ కోసం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)కు మంచి ఆదరణ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన ఇగ్నో పర్యావరణ అధ్యయనానికి సంబంధించి కొత్త ప్రోగ్రాం లాంచ్‌ చేసింది. అదే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్ (MAEVS).

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నేరుగా కాలేజీ (College) కి వెళ్లి చదువుకోలేని వాళ్లకు దూర విద్యా విధానం అందుబాటులో ఉంది. దేశంలోని అనేక యూనివర్శిటీలు ఈ విధానంలో అనేక రకాల కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)కు మంచి ఆదరణ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన ఇగ్నో పర్యావరణ అధ్యయనానికి సంబంధించి కొత్త ప్రోగ్రాం లాంచ్‌ చేసింది. అదే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్ (MAEVS). ఈ కొత్త ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను ఇటీవల వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* కోర్సు వివరాలు

ఈ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. మనిషికి, ప్రకృతికి మధ్య అనుబంధాన్ని అధ్యయనం చేసి పర్యావరణ పరిరక్షణలో మనిషి పాత్రను గుర్తించడమే ఈ కోర్సు తాలూకా ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఎదురవుతున్న పర్యావరణ సమస్యలు, సవాళ్లు, వాటిని విశ్లేషించి పరిష్కార మార్గాలకు అందించేందుకు కృషి చేయాలి.

ఈ ప్రోగ్రాంలో 19 కోర్సుల్లో మొత్తం 80 అకడమిక్ క్రెడిట్‌లు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు మూడో సెమిస్టర్‌లో తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకోవచ్చు. ఫైనల్ ఇయర్‌లో ప్రాజెక్టు వర్క్‌కు ఆరు క్రెడిట్లు ఉంటాయి. మొదటి ఏడాది పూర్తి చేసిన వాళ్లు ఎన్‌విరాన్మెంటల్‌ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందేందుకు అర్హులు.

* అర్హతలు, ఫీజు వివరాలు

పాఠశాల, కళాశాల అధ్యాపకులు, ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జిక్యూటివ్స్, పాలసీ మేకర్స్, పాత్రికేయులు, మిడ్-కెరియర్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సు చేయడానికి అర్హులు. వీరు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేసి ఉండాలి. ఇంగ్లీష్ లో బోధన జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఈ కోర్సు చేద్దామనుకున్న వాళ్లు ఏడాదికి రూ.6,000 చెల్లించాలి. మొత్తం ఫీజు రూ.12,000. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. జనవరి లేదా జులై సెషన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..!

* దరఖాస్తు చేసుకోండి ఇలా

మొదట యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలోకి వెళ్లండి. హోమ్ పేజీలో రిజిస్టర్ ఆన్‌లైన్‌ (Register online) ట్యాబ్ కింద ఫ్రెష్ అడ్మిషన్ (Fresh Admission) అనే లింక్‌పై క్లిక్ చేయండి. అందులో కొత్త దరఖాస్తుల కోసం న్యూ రిజిస్ట్రేషన్ (New Registration) అనే దానిపై క్లిక్ చేయగానే ఒక అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మీ తాలూకా ప్రోగ్రామ్ వివరాలు, ప్రస్తుతం మీరు చేస్తున్న కోర్సు వివరాలు పొందుపరచండి.

స్టడీ మెటీరియల్‌ను ఏ విధానంలో తీసుకోవాలని అనుకుంటున్నారో కూడా నమోదు చేయండి. అందులోని వివరాల ప్రకారం.. మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. అంతా పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ (Submit) క్లిక్ చేయండి. అంతా పూర్తి చేసిన తర్వాత మీరు పూర్తి చేసిన వివరాలతో ఫారం వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి. తర్వాత అవసరాలకు ఉపయోగపడుతుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, IGNOU, JOBS

ఉత్తమ కథలు