IGNOU Innovation award: జ్యోతిష్యం కెరీర్‌గా ఎంచుకున్నారా...అయితే డిగ్రీ పొందండి ఇలా...

ప్రతీకాత్మక చిత్రం

ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ జూన్ అడ్మిషన్ల కోసం వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్లను ఆహ్వానించింది. కొత్తగా జ్యోతిషశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్​ను ప్రవేశపెట్టింది.

  • Share this:
ఉన్నత విద్యను అన్ని వర్గాలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్న ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU).. తాజాగా ఒక అవార్డు కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టూడెంట్ ఇన్నొవేషన్ అవార్డు-2021 కోసం వర్సిటీ విద్యార్థుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. వారు వినూత్నంగా అభివృద్ధి చేసిన ఆవిష్కరణల గురించి తెలుపుతూ నిర్దేశిత రూపంలో అప్లికేషన్ సమర్పించాలి. ఎంట్రీలకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్, మార్గదర్శకాలను ఇగ్నో వెబ్ సైట్ ignou.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వివరాలను sites.google.com/ignou.ac.in/navrieti/sia-2021 లింక్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. విద్యార్థుల నుంచి ఎంట్రీలను స్వీకరించడానికి చివరి తేదీ 2021 సెప్టెంబరు 30.

పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించడమే లక్ష్యం..
ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెబుతున్నారు నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నొవేషన్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (NCIDE) డైరెక్టర్ డాక్టర్ ఓపీ శర్మ. ఆయన మాట్లాడుతూ.. ‘పరిశోధనలు, ఆవిష్కరణలను గుర్తించడం దేశం అభివృద్ధి, వృద్ధికి ఎంతో ముఖ్యం. ఇగ్నో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఇన్నొవేటర్లయిన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికి ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా ఇన్నొవేషన్ అవార్డును అందిస్తోంది’ అని తెలిపారు.

ఇగ్నోలో NCIDE విభాగాన్ని మొదటిసారిగా 2018లో ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్ ఇన్నొవేషన్ అవార్డుల పథకాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాల స్థాపన రోజున ముగ్గురు ఉత్తమ ఇన్నొవేటర్లకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఎంపికైన ఉత్తమ మూడు ఎంట్రీలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులను(రూ.10,000, రూ.7,000, రూ.5,000 ) ఇస్తున్నారు.

జ్యోతిషంలో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభం..
ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ జూన్ అడ్మిషన్ల కోసం వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్లను ఆహ్వానించింది. కొత్తగా జ్యోతిషశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్​ను ప్రవేశపెట్టింది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (జ్యోతిష్) పేరుతో ఈ ప్రోగ్రామ్​ను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్​ ద్వారా విద్యార్థులు జ్యోతిషశాస్త్రంలో జ్ఞానం, అభ్యాసాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. రెండేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సు హిందీ భాషలోనే అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది జులై సెషన్‌లో ఈ కోర్సును ప్రారంభించారు.
Published by:Krishna Adithya
First published: