హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఇగ్నో స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం.. క్యాష్ ప్రైజ్ ఎంతంటే..?

IGNOU: ఇగ్నో స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం.. క్యాష్ ప్రైజ్ ఎంతంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)... ఈ ఏడాదికి సంబంధించి ‘స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు’ కోసం తమ ఎంట్రీలను పంపాల్సిందిగా అభ్యర్థులను ఆహ్వానించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విద్యార్థుల్లో (Students) క్రియేటివిటీ పెంపొందించేందుకు పలు సంస్థలు అనేక ప్రోగ్రామ్స్ చేపడుతుంటాయి. వారిని మరింతగా ప్రోత్సహించడానికి అవార్డ్స్ కూడా ఇస్తుంటాయి. తాజాగా ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)... ఈ ఏడాదికి సంబంధించి ‘స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు’ (Student Innovation Award) కోసం తమ ఎంట్రీలను పంపాల్సిందిగా అభ్యర్థులను ఆహ్వానించింది. ఏదైనా వినూత్నంగా అభివృద్ధి చేసిన వర్సిటీ బోనఫైడ్ విద్యార్థులు మాత్రమే ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.* ప్రెజెంటేషన్ రంగాలు..
హెల్త్ కేర్, బయో మెడికల్ డివైజస్, దివ్యాంగుల సహాయపడే ఆవిష్కరణలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, డిస్పోజబుల్ వంటి రంగాల్లో విద్యార్థులు తమ క్రియేటివ్ ట్యాలెంట్‌ను ప్రదర్శించాల్సి ఉంటుంది.
* వర్చువల్ మోడ్‌లో ప్రెజెంటేషన్..
అభ్యర్థులు తమ దరఖాస్తులను ncide@ignou.ac.in‌కి ఇమెయిల్ చేయవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తమ ఆవిష్కరణల డెవలప్ మెంట్ ప్రక్రియను, అది ఎలా పనిచేస్తుందో వర్చువల్ మోడ్‌లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విజేతలకు వ్యక్తిగతంగా, అలాగే ఇగ్నో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా తెలియజేయనుంది.
* అవార్డ్ వివరాలు..
ఉత్తమ మూడు ఎంట్రీలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థికి రూ. 10,000, రెండో స్థానానికి రూ.7000, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థికి రూ.5,000 క్యాష్ ఫ్రైజ్ ఇవ్వనున్నారు. క్రియేటివిటీ అభ్యర్థులను మరింత ప్రోత్సహించడానికి, వారిలో క్రియేటివ్ స్కిల్స్‌ను మరింత మెరుగుపర్చడానికి, భవిష్యత్తులో కొత్త ఇన్నోవేషన్స్ రూపొందించేలా ఎంపికైన అభ్యర్థులకు స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ కింద క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఇగ్నో యూనివర్సిటీ పేర్కొంది.
* ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద..
స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డు కార్యక్రమం ద్వారా క్రియేటివిటీ స్కిల్స్ ఉన్న విద్యార్థులను గుర్తించడం, వారిని మరింత ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఇగ్నో యూనివర్సిటీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద ఈ కార్యక్రమానికి ఇగ్నో యూనివర్సిటీ రూపకల్పన చేసింది.
* 2018 నుంచి అవార్డుల ప్రదానం..
ఇగ్నో యూనివర్సిటీలో స్టూడెంట్ ఇన్నోవేషన్ అవార్డ్‌ను 2018లో నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (NCIDE) ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి, ప్రతి సంవత్సరం వర్సిటీ మొదటి మూడు ఆవిష్కర్తలకు అవార్డులను ప్రదానం చేస్తోంది. అవార్డ్ కోసం షార్ట్‌లిస్ట్ జాబితాలోని ఇతర ఇన్నోవేటర్స్‌లో స్కిల్స్ పెంపొందించడానికి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IGNOU, JOBS

ఉత్తమ కథలు