హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Junior Assistant Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

Junior Assistant Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులకు సంబంధించి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. IGNOU ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా..  అభ్యర్థులు 20 ఏప్రిల్ 2023 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.nta.nic.inని సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ 200 పోస్టుల్లో 83 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌, 29 ఎస్సీ, 12 ఎస్టీ, 55 ఓబీసీ, 21 ఈడబ్ల్యూఎస్‌ పోస్టులు కేటాయించారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి నిమిషానికి 40 పదాల వేగంతో ఇంగ్లీష్ టైపింగ్ మరియు నిమిషానికి 35 పదాల వేగంతో హిందీ టైపింగ్ చేయాల్సి ఉంటుంది.

వయో పరిమితి..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ఇలా..

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష ద్విభాషా (హిందీ/ఇంగ్లీష్) లో నిర్వహించబడుతుంది. రాత పరీక్షలో అభ్యర్థుల నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు.  దీనికి అభ్యర్థులకు రెండు గంటల సమయం ఇస్తారు. సీబీటీ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను ఖాళీల సంఖ్యకు పదిరెట్లు ఉంచి మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. టైర్ I CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు స్కిల్ (టైపింగ్) పరీక్ష ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ హిందీ లేదా ఆంగ్ల భాషలో ఉంటుంది.

Education-Jobs News: టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీలు.. పదో తరగతి హాల్ టికెట్స్.. నేటి విద్యా, ఉద్యోగ సమాచారం ఇలా..

వేతనం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19 వేల 900 నుంచి రూ.63 వేల 200 వరకు వేతనం ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ఫీజు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎలా దరఖాస్తు చేయాలి..

-ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ recruitment.nta.nic.inకి వెళ్లండి.

-దీని తర్వాత, అభ్యర్థి హోమ్‌పేజీలో IGNOU JAT 2023 లింక్‌పై క్లిక్ చేయండి.

-ఆపై అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను పూరించండి.

-దీని తర్వాత, అభ్యర్థులు అడిగిన అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

-తర్వాత అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

-చివరగా, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత.. అభ్యర్థి ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంభం: 22 మార్చి 2023

దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2023

దరఖాస్తులో ఎడిట్ కు అవకాశం: 21 - 22 ఏప్రిల్ 2023

First published:

Tags: Central Government Jobs, IGNOU, JOBS

ఉత్తమ కథలు