Home /News /jobs /

IGNOU HAS EXTENDED THE REGISTRATION DATE TILL JULY 15 FOR STUDENTS UMG GH

IGNOU: ఇగ్నో రీ- రిజిస్ట్రేషన్ తేదీ పొడిగింపు.. తుది గడువు, ప్రోగ్రామ్ వివరాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) (IGNOU) జులై సెషన్- 2022 రీ-రిజిస్ట్రేషన్ (Registration) తేదీని పొడిగించింది. జులై 15, 2022 వరకు అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ignou.ac.in ద్వారా జులై సెషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

ఇంకా చదవండి ...
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) (IGNOU) జులై సెషన్- 2022 రీ-రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. జులై 15, 2022 వరకు అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు (Candidates) అధికారిక వెబ్ సైట్ ignou.ac.in ద్వారా జులై సెషన్‌ కోసం దరఖాస్తు (Application) చేసుకోవచ్చని సూచించింది.

* రీ-రిజిస్టర్ చేసుకోవడానికి అభ్యర్థులు సమర్థ్ పోర్టల్ ignou.samarth.edu.in ద్వారా కూడా లాగిన్ కావచ్చు. అభ్యర్థులు తదుపరి సంవత్సరం/సెమిస్టర్ కోసం రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. జులై -2022 సెషన్ కోసం రీ-రిజిస్ట్రేషన్ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.

* రీ-రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం
స్టెప్-1: ఇగ్నో సమర్థ అధికారిక వెబ్‌సైట్ ignou.samarth.edu.inను సందర్శించాలి.
స్టెప్-2: లాగిన్ వివరాలు నమోదు చేసి, సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి.
స్టెప్-3: అప్లికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
స్టెప్-4: చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
స్టెప్-5: భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?


జులై-2022 సెషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు అప్‌డేట్ కాకపోతే.. వెంటనే రెండోసారి చెల్లింపు చేయవద్దు. ఒక రోజు వరకు వేచి ఉండండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసిన తరువాత నిర్ణయం తీసుకోండి. ఒకే దరఖాస్తు కోసం రెండు సార్లు ఫీజు చెల్లింపు చేస్తే, ఒక పేమెంట్ తిరిగి రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌సైట్‌ను పరిశీలించవచ్చు.

మరోపక్క జులై 2022 సెషన్ కోసం ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) ప్రోగ్రామ్‌లలో ఇగ్నో యూనివర్సిటీ ప్రవేశాలను కల్పిస్తుంది. ఈ మేరకు రిజిస్ర్టేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో జులై 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.



* ప్రోగ్రామ్స్ వివరాలు
వివిధ స్ట్రీమ్‌లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. యూజీ ప్రోగ్రామ్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ ఆనర్స్ సైకాలజీ, బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్, బీఏ ఆనర్స్ సోషియాలజీ, బీఏ ఆనర్స్ ఆంత్రోపాలజీ ముఖ్యమైనవి. అదేవిధంగా మాస్టర్స్ ప్రోగ్రామ్‌ స్ర్టీమ్‌లో... మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA (బ్యాంకింగ్, ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) వంటివి ఉన్నాయి.
ఇగ్నో జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఒక ప్రోగ్రామ్‌కు మాత్రమే ఫీజు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఫీజు మినహాయింపు కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించినట్లయితే, వాటిని ఇగ్నో యూనివర్సిటీ తిరస్కరిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, IGNOU, JOBS, UGC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు