New NEP 2020: జాతీయ నూతన విద్యా విధానం...పెదవి విరిచిన IGNOU మాజీ వీసీ

IGNOU - Distance Education | కీలకమైన దూర విద్యా విధానాన్ని జాతీయ నూతన విద్యా విధానంలో ప్రస్తావించకపోవడం పట్ల ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ వీఎస్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: August 27, 2020, 2:43 PM IST
New NEP 2020: జాతీయ నూతన విద్యా విధానం...పెదవి విరిచిన IGNOU మాజీ వీసీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానంతో లాభనష్టాలపై చర్చ కొనసాగుతోంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని కొందరు స్వాగతిస్తుండగా...మరికొందరు పెదవి విరుస్తున్నారు. జాతీయ విద్యా విధానంలో దూరవిద్య ప్రస్తావన లేకపోవడం పట్ల ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫసర్ వీఎస్ ప్రసాద్ స్పందించారు. జాతీయ నూతన విద్యా విధానంలో దూర విద్య ప్రస్తావన లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితుల్లో రెగ్యులర్ విద్యా విధానానికి దూర విద్యా విధానం ప్రత్యామ్నాయం కానుందని అన్నారు. అంతటి కీలకమైన దూర విద్యా విధానం గురించి జాతీయ విద్యా విధానంలో కనీసం ప్రస్తావించకపోవడం సరికాదన్నారు.

ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయ రంగంలోనూ దేశం స్వయంసమృద్ధి సాధించాలని వీఎస్ ప్రసాద్ ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వర్చువల్ జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Published by: Janardhan V
First published: August 27, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading