Home /News /jobs /

IGNOU: ఇగ్నో జూన్ 2021 రిజిస్ట్రేషన్‌ వ్యాలిడిటీ పెంపు.. డిసెంబర్ వరకు పొడిగింపు.. వివరాలివే

IGNOU: ఇగ్నో జూన్ 2021 రిజిస్ట్రేషన్‌ వ్యాలిడిటీ పెంపు.. డిసెంబర్ వరకు పొడిగింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2021 జూన్‌తో యూనివర్సిటీ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ముగించుకున్న విద్యార్థుల(Students) కోసం రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీని డిసెంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్లు ఇగ్నో(IGNOU) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) విద్యార్థులకు శుభవార్త అందించింది. 2021 జూన్‌తో యూనివర్సిటీ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ముగించుకున్న విద్యార్థుల కోసం రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీని డిసెంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్లు ఇగ్నో(IGNOU) ప్రకటించింది. అలాగే ల్యాబ్ కోర్సులు, అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్‌లు, డిసర్టేషన్ (dissertation), ఇంటర్న్‌షిప్, థీసిస్ ప్రాక్టికల్ ఎగ్జామ్ వంటి మూల్యాంకన భాగాల్లో ఏదీ పూర్తి చేయని విద్యార్థుల రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీని డిసెంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్లు ఇగ్నో(IGNOU) వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 2021 వరకు వ్యాలిడిటీ(validity)ని పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ (University) వివరించింది. ఈ ప్రోగ్రామ్ పొడిగింపు అనేది టర్మ్-ఎండ్-ఎగ్జామ్స్(TEE) జూన్ 2020, డిసెంబర్ 2020 లేదా జూన్ 2021లో ప్రోగ్రామ్ వ్యాలిడిటీ గడువు ముగిసిన విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రోగ్రామ్ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ అనేది విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్న కోర్సులకు టీఈఈలో హాజరు కావడానికి అనుమతిస్తుంది. జూన్ 2020కి ముందు మిగిలిపోయిన కోర్సును పూర్తి చేయడానికి ఫ్రెష్ రిజిస్టర్ విద్యార్థులకు మాత్రం అనుమతి ఉండదు.

టీఈఈ డిసెంబర్ 2021 నాటికి విద్యార్థులు తమ అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్, డిసర్టేషన్, థీసిస్ మొదలైన వాటిని సమర్పించవచ్చు. అలాగే ఇదే సమయంలో మిగిలిపోయిన కోర్సులకు సంబంధించిన అసంపూర్ణ ల్యాబ్ వర్క్స్ ను కూడా విద్యార్థులు పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా.. తాజాగా ఇగ్నో అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం జూలై 2021 సెషన్ లోని ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL), ఆన్‌లైన్ అడ్మిషన్ గడువును పొడిగించింది. దాంతో ఈ అభ్యర్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
IGNOU: ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే ఇగ్నోలో ఎంబీఏ అడ్మిషన్.. పూర్తి వివరాలు

జులై 2021లో మాక్సిమం ప్రోగ్రామ్, రీఅడ్మిషన్ వ్యాలిడిటీ పూర్తయిన విద్యార్థులు కూడా మళ్లీ ఇప్పుడు డిసెంబర్ 2021 వరకు గడువు పొందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాల ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ.. ముఖ్యంగా ఎంపీ/ఎంపీబీ విద్యార్థుల విషయంలో పొడిగించడం జరిగింది. తద్వారా డిసెంబర్ 2018 సెమిస్టర్ నుంచి కోర్సు కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు డిసెంబర్ 2021 టీఈఈలో హాజరు కావడానికి వీలవుతుంది.
UPSC Civils Exam: సివిల్స్ రాయాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో డిసెంబర్ టీఈఈ 2021ని జనవరి 20 నుంచి ఫిబ్రవరి 22, 2022 వరకు నిర్వహిస్తుంది. పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగుతాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో షిఫ్టు జరుగుతుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Admissions, Career and Courses, IGNOU, IGNOU TEE, Students, University exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు