దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరొందిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- ఇగ్నోలో దూరవిద్య కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త. జులై సెషన్ అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం గతంలో ప్రకటించిన తుది గడువును యూనివర్సిటీ తాజాగా పొడిగించింది. ఇప్పటికే, జనవరి 2022 సెషన్ కోసం ఇగ్నో యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ దరఖాస్తు గడువు ముగియగా.. తాజాగా, ఈ గడువును మార్చి 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. వీలైనంత త్వరగా దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఓడీఎల్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులు ఇగ్నో అడ్మిషన్ పోర్టల్ www.ignouadmission.samarth.edu.in ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
మరోవైపు, ఆన్లైన్ ప్రోగ్రామ్‌లకు www.ignouiop.samarth.edu.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యాసకులు లింక్ ద్వారా తదుపరి సంవత్సరం/సెమిస్టర్ కోసం వారి రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను www.onlinerr.ignou.ac.in వెబ్సైట్లో సమర్పించవచ్చని ఇగ్నో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా కొత్త ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నచ్చిన కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతే.. కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. ఓడీఎల్ కోసం www.ignouadmission.samarth.edu.in, ఆన్లైన్ కోర్సుల కోసం www.ignouiop.samarth.edu.in వెబ్‌సైను సందర్శించండి.
2. 'అప్లికేషన్ ప్రాసెస్' లింక్‌పై క్లిక్ చేయండి.
3. కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
4. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయండి.
5. మీ దరఖాస్తు రుసుమును చెల్లించి, సబ్మిట్పై క్లిక్ చేయండి.
6. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఆ తరువాత అడ్మిషన్స్ సమయంలో కోర్సు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు, నాన్- రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇగ్నో జనవరి 2022 సెషన్- కోర్సులకు సంబంధించిన మరిన్ని వివరాలు, అప్డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు. ఇగ్నో ప్రస్తుతం 200 పైగా ODL ప్రోగ్రామ్‌లను, 16 ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Career and Courses, IGNOU