హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఇగ్నో జనవరి 2023 సెషన్‌ రీ-రిజిస్ట్రేషన్ గడువు మరోసారి పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

IGNOU: ఇగ్నో జనవరి 2023 సెషన్‌ రీ-రిజిస్ట్రేషన్ గడువు మరోసారి పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IGNOU: ఇగ్నో 2023 జనవరి సెషన్ కోసం రీ-రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ఇటీవల ప్రారంభించింది. అయితే ఈ గడువును మరోసారి పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

డిస్టెన్స్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు (Courses) చేయాలనుకునే వారి కోసం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్సిటీ ఏటా రెండు సెషన్లలో కోర్సులకు అడ్మిషన్స్ తీసుకుంటుంది. ఈ క్రమంలో 2023 జనవరి సెషన్ కోసం రీ-రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ఇటీవల ప్రారంభించింది. అయితే ఈ గడువును మరోసారి పొడిగించింది.

ఇగ్నో రీ-రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా విద్యార్థులు తమ తదుపరి సంవత్సరం/సెమిస్టర్ కోసం రీ-రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించడంతో పాటు జనవరి 2023 సెషన్‌కు ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సి ఉంది. వర్సిటీ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి తాజాగా అవకాశం కల్పించింది.

* ఏడాదికి రెండుసార్లు రిజిస్ట్రేషన్స్..

ఇగ్నోలో జనవరి 2023 సెషన్ కోసం అన్ని కోర్సులకు ప్రస్తుతం డిస్టెన్స్ లెర్నింగ్( ODL) ఫార్మాట్, ఆన్‌లైన్ మోడ్‌‌లో ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ నడుస్తోంది. జనవరి 2023 సెషన్‌లో కొత్త అడ్మిషన్ల కోసం గడువు జనవరి 31గా నిర్ణయించారు. సర్టిఫికెట్స్, మాస్టర్స్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇగ్నో రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

* అప్లికేషన్ ప్రాసెస్

అభ్యర్థులు ఇగ్నో యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ఓపెన్ చేయాలి. పోర్టల్‌లో హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ‘న్యూ రిజిస్ట్రేషన్ లింక్’ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఓపెన్ అయ్యే రిజిస్ట్రేషన్ ఫారంలో అన్ని వివరాలను ఫిల్ చేయండి. లాగిన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వివరాలను గుర్తించుకోండి. అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి, ఫారమ్ సబ్‌మిట్ చేయండి.

* TEE-2022 అప్లికేషన్ గడువు పొడిగింపు..

మరోవైపు, ఇగ్నో యూనివర్సిటీ టర్మ్-ఎండ్ ఎగ్జామినేషన్ (TEE)- 2022 జూన్ సెషన్ కోసం అప్లికేషన్ సబ్‌మిట్ చేసే గడువును పొడిగించింది. అభ్యర్థులు ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో జనవరి 20లోపు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల కోసం TEE పరీక్షలను జనవరి 23 నుంచి స్టార్ట్ కానున్నాయి.

ఇది కూడా చదవండి : ట్రెండీ కెరీర్ ఆప్షన్‌గా ‘విజువల్ మర్చండైజింగ్’.. భారీ జీతాలతో ఉద్యోగాలు

ఇండియన్ విద్యార్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 200గా నిర్ణయించారు. ఇతర దేశాల నుంచి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక్కో కోర్సుకు $20 ఫీజుగా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వాపసు ఇవ్వరు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.

* పరీక్ష ప్యాట్రన్ ఇలా..

అధికారిక పోర్టల్ ప్రకారం.. సర్టిఫికెట్స్, డిప్లొమా ప్రోగ్రామ్‌ల కోసం పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ (MCQ) రూపంలో ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీ విద్యార్థుల పరీక్ష డిస్క్రిప్టివ్-టైప్‌లో ఉంటుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, IGNOU, JOBS

ఉత్తమ కథలు