IGNOU Management Programmes: ఇగ్నోలో కొత్తగా రెండు మేనేజ్​మెంట్​ కోర్సులు.. అర్హత, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక వర్సిటీగా పేరొందిన ఇగ్నో.. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు పరిచయం చేస్తూ రెగ్యులర్​ వర్సిటీలకు ధీటుగా రాణిస్తోంది. తాజాగా, ఇగ్నో కొత్తగా రెండు మేనేజ్​మెంట్​కోర్సుల​ను ప్రారంభించింది.

  • Share this:
ఇందిరా గాంధీ నేషనల్​ ఓపెన్​ యూనివర్సిటీ (ఇగ్నో) గురించి తెలియని వారు ఉండరు. ఆర్థిక సమస్యల కారణంగా నేరుగా కాలేజీకి వెళ్లి చదువుకోలేని వారికి ఓపెన్​, డిస్టన్స్​ పద్దతుల్లో క్లాసులు చెబుతూ ఎంతో మందిని గ్రాడ్యుయేట్లు, పోస్ట్​ గ్రాడ్యుయేట్లుగా మార్చిన ఘనత ఈ యూనివర్సిటీ సొంతం. దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక వర్సిటీగా పేరొందిన ఇగ్నో.. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు పరిచయం చేస్తూ రెగ్యులర్​ వర్సిటీలకు ధీటుగా రాణిస్తోంది. తాజాగా, ఇగ్నో కొత్తగా రెండు మేనేజ్​మెంట్​కోర్సుల​ను ప్రారంభించింది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్​ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఎంబీఎఫ్​) వంటి రెండు కొత్త కోర్సులను ప్రారంభించింది. ఈ రెండు కోర్సులను ఆల్​ ఇండియా కౌన్సిల్​ ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్ (AICTE)​ సహకారంతో నిర్వహిస్తుండటం విశేషం. ఈ రెండు కోర్సులకు సంబంధించిన అర్హత, వ్యవధి, ఫీజు, కోర్సు ప్రారంభం వంటి కీలక వివరాలను www.ignouadmission.samarth.edu.in వెబ్​సైట్​లో పొందుపర్చినట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

నాలుగు కొత్త పీజీ డిప్లొమా కోర్సులు..

ఇగ్నో ఎంబీఏ ప్రోగ్రామ్‌లతో పాటు కొత్తగా నాలుగు పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లను కూడా ఆఫర్​ చేస్తోంది. వీటిలో పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ (PGDMM), పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (PGDFM), పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (PGDHRM), పీజీ డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ (PGDOM) వంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించింది. ఈ ప్రోగ్రామ్స్​కు సంబంధించిన అర్హత, వ్యవధి, ఫీజు, రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కోసం ఇగ్నో అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలి. ఇదిలా ఉంటే, ఇగ్నో తాజాగా జూన్ సెషన్​ రీరిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. కరోనా మహమ్మారి కారణంగా ల్యాబ్ కోర్సులు, అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్‌లు, డిసర్టేషన్, ఇంటర్న్‌షిప్, ఫీల్డ్‌వర్క్ జర్నల్స్​ను ఇంకా పూర్తి చేయని విద్యార్థుల కోసం ఈ రీరిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది.
Published by:Krishna Adithya
First published: