హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU Admissions 2022: ఇగ్నో అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు.. దరఖాస్తు చేసుకోండిలా..

IGNOU Admissions 2022: ఇగ్నో అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు.. దరఖాస్తు చేసుకోండిలా..

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జూలై 2022 సెషన్ కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(Indira Gandhi National Open University) మూడోసారి పొడిగించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

జూలై 2022 సెషన్ కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(Indira Gandhi National Open University) మూడోసారి పొడిగించింది. ఇంకా తమ దరఖాస్తు ఫారమ్‌లను(Application Form) సమర్పించని అభ్యర్థులు, వారు అధికారిక వెబ్‌సైట్‌ను(Web Site) సందర్శించి, 10 అక్టోబర్ 2022లోపు దరఖాస్తును సమర్పించాలని సూచించింది. ఇంతకు ముందు జూలై సెషన్ 2022(July Session 2022) కోసం రీ-రిజిస్ట్రేషన్(Re Registration) కోసం చివరి తేదీ 25 ఆగస్టు 2022గా ఉండేది. ఆ తర్వాత దీనిని సెప్టెంబర్ 30, 2022 వరకు మరో సారి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెంచింది. తాజాగా దీనిని అక్టోబర్ 10, 2022కు మరోసారి పొడిగించారు. IGNOU సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో రీ-రిజిస్ట్రేషన్ పొడిగించిన తేదీ (IGNOU జూలై 2022 Re-Registration) గురించి సమాచారాన్ని అందించింది. అభ్యర్థులు ignouadmission.samarth.edu.inఅధికారిక వెబ్‌సైట్‌లో ఇగ్నోలో అడ్మిషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు..

IGNOU తన అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి నోటీసును కూడా జారీ చేసింది. మరింత సమాచారం కోసం.. అభ్యర్థులు జారీ చేసిన నోటీసును తనిఖీ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం.. అభ్యర్థి రూ. 250 రుసుము చెల్లించాలి. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. SC/ST కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించబడింది. రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించబడదు. అడ్మిషన్ సమయంలో మొదటి సెమిస్టర్/సంవత్సరానికి ప్రోగ్రామ్ ఫీజుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును జమ చేయడం తప్పనిసరి.

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

మరో సెమిస్టర్ కు అనుమతి..

యూనివర్సిటీలోని ఏదైనా కోర్సులో ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అభ్యర్థులు తదుపరి సెషన్‌లో తమ అధ్యయనాలను కొనసాగించాలనుకుంటే చివరి తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అదనంగా.. ప్రస్తుతం విశ్వవిద్యాలయం అందించే ఏదైనా కోర్సులు అండ్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు గడువు కంటే ముందే రీ-ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుదారులు తిరిగి నమోదు ప్రక్రియను పూర్తి చేయకుండా తదుపరి సెమిస్టర్‌కు ఏ అభ్యర్థిని అనుమతించరని గమనించాలి.

Indian Railway: పెరిగిన 500 రైళ్ల వేగం.. ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌ గా.. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ గా మారిన రైళ్లు..

రీ-రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి..

Step 1: ముందుగా అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్ https://ignou.samarth.edu.inకి వెళ్లండి.

Step 2: ఇప్పుడు అభ్యర్థి రీ-రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: అభ్యర్థులు వారి నమోదు ID అండ్ ప్రోగ్రామ్ కోడ్‌ను నమోదు చేయాలి.

Step 4: ఆ తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫీజును సమర్పించాలి.

Step 5: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. తర్వాత ఫైనల్ సబ్ మిట్ చేయాలి.

Step 6: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కొరకు అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: Admissions, Career and Courses, IGNOU, JOBS

ఉత్తమ కథలు