IGNOU Admission: ఇగ్నో జులై సెషన్ అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- ఇగ్నోలో దూరవిద్య కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జులై సెషన్ అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం గతంలో ప్రకటించిన తుది గడువును పొడిగించారు.

  • Share this:
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- ఇగ్నోలో దూరవిద్య కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త. జులై సెషన్ అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం గతంలో ప్రకటించిన తుది గడువును యూనివర్సిటీ తాజాగా పొడిగించింది. జులై 31తో ముగిసిన గడువును మరోసారి ఆగస్టు 16, 2021 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన ignou.ac.in లో దరఖాస్తు సమర్పించాలని ఇగ్నో ఒక ప్రకటనలో కోరింది. కొత్తగా దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ ద్వారా కొత్త ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నచ్చిన కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతే.. కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
IAPGET 2021: పీజీ ఆయుష్ కోర్సులకు దరఖాస్తులు షురూ.. ముఖ్యమైన తేదీలు ఇవే..
UGC NET 2021: యూజీసీ నెట్​ క్వాలిఫైడ్​ అభ్యర్థులకు ఊరట.. NTA కీలక నిర్ణయం.. వివరాలివే

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి జులై సెషన్ కోర్సులకు రిజిస్ట్రేషన్ తేదీలను పొడిగిస్తున్నట్లు ఇగ్నో తెలిపింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. వీలైనంత త్వరగా దరఖాస్తులను సమర్పించడం మంచిది.

ఇగ్నో అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రక్రియ..
ముందు అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ ignou.ac.inను ఓపెన్ చేయాలి. ఇందులో జులై- 2021 సెషన్ కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్ లింక్‌ అందుబాటులో ఉంటుంది. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే.. కొత్త విండో ఓపెన్ అవుతుంది. కొత్త విండోలో.. ODL మోడ్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్ పోర్టల్స్ కోసం ప్రత్యేకంగా ఒక లింక్ కనిపిస్తుంది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయాలి. లేదంటే హోమ్ పేజీలో జులై సెషన్ ఇగ్నో అడ్మిషన్, రీ-రిజిస్ట్రేషన్ కోసం కనిపించే డైరెక్ట్ లింక్‌పై కూడా క్లిక్ చేయవచ్చు. ఇక్కడ అడిగే అన్ని వివరాలను అభ్యర్థులు నింపాలి. అవసరమైన ఫీజు చెల్లించి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో ఇగ్నో జులై సెషన్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారం అప్లికేషన్ సబ్‌మిట్ అవుతుంది.

భవిష్యత్తు అవసరాల కోసం ఈ అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకోవడం మంచిది. ఆ తరువాత అడ్మిషన్స్ సమయంలో కోర్సు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు, నాన్- రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇగ్నో జులై సెషన్- 2021 కోర్సులకు సంబంధించిన మరిన్ని వివరాలు, అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: