• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IGCAR RECRUITMENT 2021 FOR 337 STIPENDIARY TRAINEE WORK ASSISTANT AND OTHER POSTS HERE FULL DETAILS NS

IGCAR Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ ప్రభుత్వ సంస్థలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే

IGCAR Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ ప్రభుత్వ సంస్థలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ నుంచి Ph.D విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడు రాష్ట్రంలోని కల్పక్కంలోని ఈ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుడలైంది. స్టైఫండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. అప్లికేషన్ల ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభం కాగా.. మే 14 అప్లికేషన్లకు ఆఖరి తేదీ.

    ఖాళీల వివరాలు..
    మొత్తం పోస్టులు-337
    స్టైపండరీ ట్రైనీ-289 పోస్టులు
    టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్)-1 పోస్టు
    స్టేనో గ్రాఫర్ గ్రేడ్ 3-4 పోస్టులు
    అప్పర్ డివిజన్ క్లర్క్-8 పోస్టులు
    డ్రైవర్-2 పోస్టులు
    సెక్యూరిటీ గార్డ్-2 పోస్టులు
    వర్క్ అసిస్టెంట్ 20 పోస్టులు
    క్యాంటీన్ అటెండెంట్-15 పోస్టులు
    సైంటిఫిక్ ఆఫీసర్-4 పోస్టులు
    టెక్నికల్ ఆఫీసర్-42 పోస్టులు
    Railway Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్
    NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. అప్లై చేయడానికి ఎల్లుండి వరకే ఛాన్స్.. వివరాలివే

    అర్హత వివరాలు:
    -స్టైంపడరీ ట్రైనీ(Stipendiary Trainee)-డిప్లొమో చేసిన వారు లేదా బీఎస్సీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
    -టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్)-SSC
    -స్టేనోగ్రాఫర్ గ్రేడ్ 3: పదో తరగతి విద్యార్హతతో పాటు ఇంగ్లిష్ లో 80WPM, హిందీలో 30WPM స్పీడ్ ఉండాలి.
    -అప్పర్ డివిజన్ క్లర్క్: అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఇంగ్లిష్ లో 30 WPM స్పీడ్ ఉండాలి.
    -డ్రైవర్: టెన్త్ పాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
    -సెక్యూరిటీ గార్డ్-టెన్త్ పాసై ఉండాలి.
    -వర్క్ అసిస్టెంట్-టెన్త్ పాస్
    -క్యాంటీన్ అటెండెంట్-టెన్త్ పాస్

    -సైంటిఫిక్ ఆఫీసర్/E-Ph.D విద్యార్హతతో పాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
    -టెక్నికల్ ఆఫీసర్/E-బీఈ/బీటెక్ విద్యార్హతతో పాటు 9 ఏళ్ల అనుభవం ఉండాలి.
    -సైంటిఫిక్ ఆఫీసర్/D-Ph.D
    -టెక్నికల్ ఆఫసీర్-బీఎస్సీ/ఎంఎస్సీ/బీఈ/బీటెక్ విద్యార్హత ఉండాలి.
    -వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా వయోపరిమితిని నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    -అర్హత ఆసక్తి కలిగిన వివరాలు మే 14లోగా అధికారిక వెబ్ సైట్ igcar.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.
    Notification/Application-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు