IFIM LAW SCHOOL ALERT FOR THOSE WHO WANT TO STUDY LAW DEGREE IFIM LAW SCHOOL ADMISSIONS START FOR UG LAW COURSES GH VB
IFIM Law School: లా డిగ్రీ చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. IFIM కీలక ప్రకటన.. ఆ వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
న్యాయ విద్యను అభ్యసించాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది బెంగళూరు కేంద్రంగా పనిచేసే IFIM లా కాలేజ్. BBA, LLB వంటి అండర్ గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో చేరడానికి అడ్మిషన్ ప్రక్రియను చేపట్టినట్టు IFIM (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్) లా స్కూల్ ప్రకటించింది.
న్యాయ విద్యను అభ్యసించాలనుకునే వారికి గుడ్ న్యూస్(Good News) చెప్పింది బెంగళూరు కేంద్రంగా పనిచేసే IFIM లా కాలేజ్. BBA, LLB వంటి అండర్ గ్రాడ్యుయేట్ లా(Graduate Law) కోర్సుల్లో చేరడానికి అడ్మిషన్(Admission) ప్రక్రియను చేపట్టినట్టు IFIM (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్) లా స్కూల్(Law School) ప్రకటించింది. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గుర్తింపు పొందిన విద్యా సంస్థ. అడ్మిషన్ల కోసం లా స్కూల్ అధికారిక వెబ్సైట్ admissions.ifimlawcollege.comలో నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని జూలై 31గా నిర్ణయించారు. కొత్త అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానుందని IFIM లా స్కూల్ వెల్లడించింది.
అడ్మిషన్‌కు అర్హత ప్రమాణాలు
LLB కోసం దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు, అదే SC, ST విద్యార్థులైతే 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా LSAT ఇండియా, IFIM లా అడ్మిషన్ టెస్ట్ (ISAT), డిల్లీ యూనివర్సిటీ LLB లేదా NLSAT టెస్ట్‌లో తప్పనిసరిగా స్కోర్ సాధించిఉండాలి.
BA, LLB కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 12వ తరగతి లేదా అందుకు సమానమైన దానిలో అన్రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 45 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇవే అర్హతలు పదో తరగతి లేదా అందుకు సమానమైన వాటికి వర్తించనున్నాయి. జూన్ 1, 2022 నాటికి సాధారణ కేటగిరీ అభ్యర్థులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి.
అదే SC, ST ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులైతే 22 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి. అదేవిధంగా ఏదైనా బోర్డ్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కర్నాటకలో మాత్రం హుబ్లీలోని కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం నుండి అర్హత సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం అనేక రకాల ప్రోగ్రామ్‌లను IFIM ఆఫర్ చేస్తోంది. వాటిలో ప్రధానంగా సోషల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌లు, మూట్ కోర్ట్లు, రీసెర్చ్ ఇంక్యుబేషన్, స్టార్ట్-అప్ లా క్లినిక్‌లు, చట్టపరమైన సహాయం, మెరుగైన లెర్నింగ్ ప్రోగ్రామ్‌లను అందించనుంది. అలాగే విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఫిజికల్ విల్నెస్ మెరుగుపర్చడం కోసం వ్యక్తిగత ప్రోగ్రామ్‌లను కూడా కండక్ట్ చేయనుంది.
IFIM అసోసియేట్ డైరెక్టర్-అడ్మిషన్స్ & ఔట్రీచ్ ప్రొఫెసర్ హర్షవర్ధన్ తివారీ మాట్లాడుతూ... ఐఎఫ్ఐఎం లా స్కూల్ ఎల్లప్పుడూ న్యాయ విద్య అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాది అకడమిక్ ఎక్సలెన్స్‌ని ప్రదర్శించే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారు న్యాయ నిపుణులుగా అర్హత పొందేందుకు వీలుగా 'మెరిట్-కమ్-మీన్స్' స్కాలర్షిప్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. భారతదేశ సిలికాన్ వ్యాలీకి BBA LLB అండ్ LLB తదుపరి కోహార్ట్గా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని హర్షవర్ధన్ తెలిపారు.
నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నట్లు IFIM లా స్కూల్ పేర్కొంది. అందులో భాగంగానే వ్యక్తిత్వ మెరుగుదల కార్యక్రమం, పరిశోధన ఇంక్యుబేషన్, సోషల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్, ఇండస్ట్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్, మెరుగైన ఎలక్టివ్ కోర్సులు అండ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు చేపడుతున్నట్లు IFIM ఇన్స్టిట్యూట్ తెలిపింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.