IFFCO RECRUITMENT 2022 GOLDEN JOB OPPORTUNITY FOR ENGINEERING GRADUATES APPLY BEFORE 15 AUGUST MORE DETAILS KNOW HERE VB
IFFCO Recruitment 2022: ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్స్ కు సువర్ణావకాశం.. జీతం రూ. 35 వేలు.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు శుభవార్త. ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు శుభవార్త. ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ gea.iffco.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 ఆగస్టు 2022. ఈ తేదీలోపు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5 నుండి ప్రారంభం అయింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
వేతన వివరాలు..
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ప్రక్రియ ద్వారా ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 స్టైఫండ్‌ను అందజేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లు మరియు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. అయితే, SC/ST కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అర్హత వివరాలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు సివిల్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని చేసి ఉండాలి. అర్హతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడాలి.
ఎంపిక విధానం..
ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్, ఫైనల్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్ష అహ్మదాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, లక్నో, పాట్నా మరియు ముంబైలలో జరుగుతుంది. దీని కోసం అభ్యర్థులెవరూ దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పైన పేర్కొన్న కేంద్రాలలో అభ్యర్థులు తమ ఎంపిక క్రమంలో ఏదైనా రెండు పరీక్ష కేంద్రాలను తప్పనిసరిగా ఎంచుకోవాలి. రాత పరీక్ష అనంతరం.. వ్యక్తిగత ఇంటర్వ్యూ , మెడికల్ పరీక్షల తర్వాత అభ్యర్థులను ఎన్నుకుంటారు.
జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఏదైనా IFFCO కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ లో బదిలీ ప్రక్రియ ఉంటుంది.
శిక్షణ కాలం: ఎంపికైన వ్యక్తులు ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతారు. ఇది 1961 అప్రెంటీస్ చట్టం కింద ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ఇక్కడ తెలిపిన లింక్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.