Jobs: హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో జాబ్స్

IFB Hyderabad Recruitment 2020 | హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 16, 2020, 3:23 PM IST
Jobs: హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో జాబ్స్
Jobs: హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్-IFB Hyderabad ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 20 చివరి తేదీ. ఖాళీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://ifb.icfre.gov.in/ ఓపెన్ చేసి వేకెన్సీ సెక్షన్‌లో చూడొచ్చు.

IFB Hyderabad Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు- 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 20
విద్యార్హత- అగ్రికల్చర్‌ లేదా బాటనీ లేదా బయో టెక్నాలజీ లేదా మెరైన్ బయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తు విధానం- అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వివరించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Director, IFB,
Dulapally, Kompally SO,
Hyderabad - 500100.

నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

Jobs: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 307 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

 
First published: March 16, 2020, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading