Home /News /jobs /

IF YOUR GOAL IS TO GET A GOOD RANK IN JEE MAINS FOLLOW THESE TIPS HERE TO KNOW VB TPT

JEE Mains Preparation Tips: జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ మీ లక్ష్యం అయితే.. ఈ టిప్స్ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్స్ లో(JEE Mains) ర్యాంక్  రావాలంటే ప్రాక్టీస్(Practice) అనేది కీ సక్సెస్(Success) లా పనిచేస్తుంది. ఆరు నెలల పాటు ఈ పోటీ పరీక్షలకు శ్రద్దగా చదవాలి.

    (GK హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18)

    జేఈఈ మెయిన్స్ లో(JEE Mains) ర్యాంక్  రావాలంటే ప్రాక్టీస్(Practice) అనేది కీ సక్సెస్(Success) లా పనిచేస్తుంది. ఆరు నెలల పాటు ఈ పోటీ పరీక్షలకు శ్రద్దగా చదవాలి. పరీక్షలో ముఖ్యంగా మనం రాసె ప్రశ్నలపై మన భవితవ్యం ఆధారపడి ఉంటుందని తిరుపతి జిల్లాలో ఉన్న వెలాసిటీ ఇన్స్టిట్యూట్ ఎండీ, సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ బై వీర శేఖర్ ప్రిపరేషన్ టిప్స్ లో భాగంగా తెలిపారు. మనం ముందుగా కెమిస్ట్రీ లోని(Chemistry) ప్రశ్నలు రాయడం ద్వారా కొంత సమయం ఆదా అవుతుంది. అనంతరం మ్యాథమెటిక్స్(Mathematics) కు రావాలి.. చివరగా పిల్లలు అందరూ కష్టంగా భావించే ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానం ఇస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు.

    Amazon Prime Sale: అమెజాన్ లో అద్భుత ఆఫర్లు.. రూ. 99లకే వస్తువులు.. ల్యాప్ టాప్స్ పై 75 శాతం రాయితీ..


    ముందుగా మనం రాసె ప్రశ్నను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని ఆ ప్రశ్న మనకు వచ్చు అనుకుంటేనే వాటికీ సమాధానం రాయాలి.....లేదంటే వేరే ప్రశ్నకు స్కిప్ అవ్వాలి. రెండు... మూడు ప్రశ్నలు రాకుంటే భయపడాల్సిన అవసరం లేదు వచ్చిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాస్తే చాలు. ఒత్తిడిని తగ్గించుకొని... మనకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే కచ్చితంగా జేఈఈ మెయిన్స్ లో ర్యాంక్ సాధించవచ్చు. మొదట ఈజీ ప్రశ్నలకు సమాధామం రాసి... అనంతరం కొంచం కష్టమైన ప్రశ్నలకు సమాధానం రాయాలి. టైం ఉంటె ఫైనల్ గా అతి కష్టమైన ప్రశ్నలకు సమాధానం రాయాలని సూచించారు.



    అర్థం చేసుకుంటే ఫిజిక్స్ కంటే సులభమైన సబ్జెక్టు వేరొకటి ఉండదన్నారు. జేఈఈ మెయిన్స్ లో విద్యార్థులకి కష్టమైన సబ్జెక్టు కూడా ఫిజిక్స్(Physiscs) మాత్రమే. కష్టం కష్టం అనుకుంటే ఫిజిక్స్ చాల కష్టంగానే ఉంటుంది. ఫిజిక్స్ పై పిల్లల ఆలోచన విధానం మారితే ఫిజిక్స్ లో సైతం మార్కులు రాబట్టడం సాధ్యం అవుతుంది. రెండు నెలల్లో ఫిజిక్స్ ను ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలను సాధించవచ్చు. ఫిజిక్స్ లో ముఖ్యంగా మెకానిక్స్ ను(Mechanics) చదువుతూ ఉంటారు విద్యార్థులు. అందులో ఈస్ట్ అఫ్ మెకానిక్స్., ఆసిలేషన్స్., థర్మల్ ప్రాపర్టీస్., ధర్మో డైనమిక్స్., గ్రావిటేషన్ ఉంటాయి.

    TS Teachers Jobs: ఈ యేడు కూడా విద్యావలంటీర్లే..!ఉపాధ్యాయ నోటిఫికేషన్లకంటే ముందే మరో టెట్..?


    ఇందులో గ్రావిటేషన్ లో కచ్చితంగా ఒక్క ప్రశ్న వస్తుంది. గ్రావిటేషన్ నేర్చుకోవడం ద్వారా 4 మార్కులు కచ్చితంగా మీ చేతిలో ఉన్నట్లే. థర్మోడైనమిక్స్ చాల సులువుగా ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులకంటే ఫిజిక్స్ పై కొంత అధిక సమయాన్ని కేటాయించండి. ఫార్ములాస్ తరావుగా నేర్చుకుంటే మరింత సులభంగా ఫిజిక్స్ లో మనం స్కోర్ చేయవచ్చు. రెండవ సంవత్సరం ఇంటర్ లో ఏడు చాప్టర్ లు 50 శాతం సిలబస్ కవర్ చేయవచ్చు.  వచ్చిన ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయండి... సమాధానం తెలియని ప్రశ్నలను రాసి నెగిటివ్ మార్కులు పొంది... ర్యాంక్ ను కోల్పోవద్దని విద్యార్థులకు సూచించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, Jee, Jee main 2022, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు