Home /News /jobs /

IF YOU WANT TO GET A GOOD RANK IN EAMCET FOLLOW THE TIPS MENTIONED HERE VB VSP

AP Eamcet Preparation Tips: ఎంసెట్ లో మంచి ర్యాంక్ మీ లక్ష్యమా.. అయితే ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Eamcet Preparation Tips: ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్(Engineering), మెడికల్(Medical), అగ్రికల్చర్ (Agriculture) విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ(Batchlor Degree) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఎంసెట్(Eamcet). 

ఇంకా చదవండి ...
    (P. ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18)

    ఇంటర్మీడియెట్ ఎంపీసీ(Intermediate MPC/బైపీసీ(BiPC) విద్యార్థులకు ఇంజనీరింగ్(Engineering), మెడికల్(Medical), అగ్రికల్చర్ (Agriculture) విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ(Bachelor Degree) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఎంసెట్(Eamcet).  రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండు రాష్ట్రాలు(Two States) విడివిడిగా ఎంసెట్(Eamcet) నిర్వహిస్తున్నాయి. ఈ ఎంసెట్ లను రాసి రెండు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కాలేజీలు(Engineering Colleges), యూనివర్శిటీల్లో(Universities) ప్రవేశాలు ఇంజీనీరింగ్ సీటు పొందవచ్చు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యార్ధులంతా ఎంసెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా చదివితే మంచి మార్కులు సాధించగలుగుతామో వివరంగా చూద్దాం..

    TS ICET Prepartion Tips: TS ICET పరీక్షకు ఎలాంటి వ్యూహాంతో సిద్ధం కావాలో ఆలోచిస్తున్నారా..? ఈ చిట్కాలు మీ కోసమే.


    ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా.. సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. వాటిలో సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మంది చూపు ఇంజినీరింగ్ పైనే ఉంటుంది. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు హాజరవుతూ పోటీ పడుతున్నారు.

    ప్రతీ ఏటా ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతున్నా మంచి ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు మాత్రం తగ్గడం లేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఇంజనీరింగ్ సులువైన మార్గం. అందుకే తల్లిదండ్రుల్లోనూ ఇంజినీరింగ్ కోర్సులంటే ఆసక్తి వుంది. ఇలా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్, రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే ఎంసెట్ లాంటి పరీక్షల కోసం ఒకేసారి సన్నద్దమవుతుంటారు.

    ఇలా ఇంటర్మీడియట్ లో చేరిన తొలిరోజు నుంచే విద్యార్ధులు.. ఎంసెట్ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ కావాలనుకునే విద్యార్ధులంతా ఎంసెట్ కోసం ఇంటర్ తొలి సంవత్సరం నుండే .. ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం అనే ఆలోచనలతో ఉండే విద్యార్ధులు ఇంటర్ రెండు సంవత్సరాల సిలబస్‌పై పట్టు సాధిస్తే.. ఎంసెట్ లో మంచి ర్యాంకు ను సాధించవచ్చు.

    AP EAMCET 2022 Physics Preparation Tips: ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్ ఇవే.. తెలుసుకోండి

    ఇక ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా తగ్గించిన సిలబస్ నుండే ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. కాబట్టి ఎంసెట్ కు కూడా అదే సిలబస్ నుండి వచ్చిన టాపిక్స్ ను చదివితే సరిపోతుంది. సిలబస్ లో లేని సబ్జెక్స్స్, టాపిక్స్ ను వదిలిపెట్టేయాలి. ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మ్యాధమేటిక్స్ నుండి తగ్గించిన సిలబస్ ను చూసుకొని, అందులో ఏ చాప్టర్ నుండి, ఏ టాపిక్స్ వస్తున్నాయో దాని ప్రకారం చదువుకుంటే సరిపోతుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలో మ్యాథమేటిక్స్ 80 మార్కులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40, 40 మార్కులతో మొత్తం 160 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. మెడికల్ విభాగంలో జువాలజీ 40, బోటనీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మొత్తం 160 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.

    Singareni Jobs 2022: సింగరేణి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే పరీక్ష తేదీ.. దరఖాస్తు విధానం తెలుసుకోండి..


    ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి..
    ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించాలన్నా, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు సాధించాలన్నా.. ప్రిపరేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ ఎగ్జామ్స్ అనంతరం 10 నుండి 12 రోజులు ఫస్ట్ ఇయర్ సిలబస్ కోసం, 10 నుండి 12 రోజులు సెకండ్ ఇయర్ సిలబస్ కోసం కేటాయించాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్ లపై ధ్యాస పెట్టాలి. ఎంసెట్‌లో దాదాపు ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అవి ఇన్‌డెరైక్ట్‌గా ఆయా భావనల ఆధారంగా ఉంటాయి. దీన్ని గుర్తించి కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. అందుకు తగిన విధంగా స్టడీ మెటీరియల్‌ సిద్దం చేసుకోవాలి. అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివరలో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి.

    టేబుల్స్, చార్ట్స్, పాయింట్స్ రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంశాల ప్రిపరేషన్‌కు నిర్దిష్ట టైమ్ ప్లానింగ్ అనుసరించాలి. ఎంసెట్ ఎగ్జామ్ కు టైం దగ్గర గా ఉంది. కాబట్టి ప్రిపరేషన్ లో కొత్త టాపిక్స్ జోలికి వెళ్లకుండా మీరు నేర్చుకున్న దానిలో పరిపూర్ణత సాధించండి. ఇంటర్ లో అకడమిక్ పరంగా క్లిష్టంగా భావించి విస్మరించిన అంశాల జోలికి వెళ్లకూడదు. ముఖ్యంగా ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తరుచుగా రాయడం వల్ల ఎలా రాయాలో అవగాహన వస్తుంది.

    ఇదీ చదవండి: పబ్లిసిటీ కోసం పాదయాత్రలు అవసరం లేదు.. తానుబీజేపీ మనిషిని అంటూ మోహన్ బాబు యూటర్న్..

    ఎంసెట్ ప్రిపరేషన్‌లో సమయపాలన చాలా ముఖ్యం. గంటల కొద్దీ ఒకే టాపిక్‌ను చదవకూడదు. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా సమయం కేటాయించాలి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. మీరు ఈ సబ్జెక్టు లో వీక్ గా ఉన్నారో తెలుసుకొని ఆ సబ్జెక్టు లో ఇంప్రూవ్ కావడానికి ప్రయత్నించాలి. ఆయా సబ్జెక్టులలో ఏ చాప్టర్ నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకొని, ఆ చాప్టర్ పై ఎక్కువ పట్టు సాధించాలి . పరీక్షకు వారం ముందు కొత్తవి చదవడానికి ప్రయత్నించకండి. చదివిన వాటిని పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Ap eamcet, Career and Courses, JOBS, Preparation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు