(P. Anand Mohan, News 18, Visakhapatnam)
దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్ లను నియమించనుంది. ఇక రక్షణ శాఖలోని మూడు విభాగాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో అగ్నివీర్ స్కీం (Indian Navy Agniveer SSR) నోటిఫికేషన్ ను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. SSR పోస్ట్‌లకు 2800 ఖాళీలు ఉన్నాయి. ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR) పరీక్షను అక్టోబర్ 2022లో నిర్వహించబోతోంది. దీనిలో ఇండియన్ నేవీ అగ్నివీర్ ఆన్ లైన్ ఎగ్జామ్ ప్యాట్రన్ ఏంటి..? ఏఏ సబ్జెక్టుల్లో ఏఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలి..? ఎలా చదువుకోవాలి..? ఎలా ఎగ్జామ్ రాయాలి..? అనే అంశాలను ఈ స్టోరీలో చూద్దాం.
ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టులకు సంబంధించిన కావాల్సిన అర్హతలను చూస్తే.. గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి గణితం, భౌతికశాస్త్రం మరియు వీటిలో కనీసం ఒక సబ్జెక్ట్‌తో 10+2 పరీక్షలో అర్హత సాధించాలి. అగ్నివీర్ (SSR) అభ్యర్థుల వయస్సు నమోదు రోజున 17½ - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అగ్నివీర్ 2022 బ్యాచ్‌కు గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాల వరకు ఒక సారి సడలింపు మంజూరు చేయబడింది.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్‌లు, డొమిసైల్ సర్టిఫికేట్ మరియు NCC సర్టిఫికేట్ (ఉంటే) అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లను రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలలో అంటే (PFT మరియు INSచిల్కాలో ఎన్‌రోల్‌మెంట్, మెడికల్ టెస్ట్) చూపించాల్సి ఉంటుంది. 'ఆన్‌లైన్ దరఖాస్తు'లో అందించిన వివరాలు ఏ దశలోనూ అసలు పత్రాలతో సరిపోలకపోతే, అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. ఇండియన్ నేవీలో రిక్రూట్‌మెంట్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి మరియు రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలలో తనిఖీ చేయబడుతుంది.
అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in నుండి కాల్ అప్ లెటర్స్ కమ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాల్ అప్ లెటర్ మరియు అడ్మిట్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపబడదు. అభ్యర్థులను సంప్రదించేటప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మోడ్ మాత్రమే ఉపయోగించబడుతుంది. రిక్రూట్‌మెంట్ యొక్క ఏ దశలోనూ పోస్ట్ ద్వారా ఎటువంటి పత్రాలు పంపబడవు. ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR) ఎంపిక ప్రక్రియ ఐదు దశలలో ఉంటుంది. మొదట షార్ట్‌లిస్టింగ్, తరువాత ఆన్ లైన్ లో రాత పరీక్ష, అనంతరం క్వాలిఫైయింగ్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT) మరియు మెడికల్ ఎగ్జామినేషన్ లలో ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్‌లలో అర్హత ఆధారంగా నవంబర్ లో మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. కటాఫ్ మార్కులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.
అభ్యర్ధికి సంబంధించిన డాక్యుమెంట్స్, అర్హతలను చూసి షార్ట్ లిస్టింగ్ చేసిన తరువాత, నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (SSR)లో ఆన్ లైన్ రాత పరీక్ష(Written exam) ఉంటుంది. ఎంపిక చేసిన సెంటర్ల లో కంప్యూటర్‌ను ఉపయోగించి నిర్వహించబడుతుంది. ఆబ్జెక్టివ్ తరహాలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ నిర్వహించబడతాయి. పరీక్ష 60 నిమిషాల పాటు ఉంటుంది. అభ్యర్థులు ప్రతి విభాగాన్ని మరియు మొత్తం పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి. ఇంగ్లీష్ (English), మేధమేటిక్స్ (Mathematics), సైన్స్(Science), జనరల్ నాలెడ్జ్(General Knowledge) సబ్జెక్ట్ లలో రాత పరీక్ష ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు.
ఇండియన్ నేవీ అగ్నివీర్(SSR) 2022: ప్రిపరేషన్ టిప్స్ అండ్ స్ట్రాటజీ ఎలా వుండాలి..?
1)పరీక్ష ఆకృతి మరియు స్కోరింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ సిలబస్ మరియు పరీక్షా విధానాన్ని తెలుసుకోవాలి. గతంలో నిర్వహించబడిన నేవీ ఎగ్జామ్ లలోని ప్రశ్నలు ఎలా వుంటాయో పరిశీలించండి. తద్వారా ప్రిపరేషన్ లో ఉపయోగపడుతుంది.
2)మెరుగైన ఫలితాల కోసం, అత్యధిక మార్కులు, వెయిటేజీలను పరిశీలించి ఆ టాపిక్స్ ను టైమ్ ఎక్కువ కేటాయించండి. టాపిక్స్ కు అనుగుణంగా వాటికి మరింత శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అవ్వండి.
3)మీ పరీక్ష సన్నద్ధత స్థాయిని పెంచడానికి, మునుపటి సంవత్సరం నుండి ప్రాక్టీస్ పరీక్షలు మరియు ప్రశ్నలను తీసుకోండి.
4)ఎక్కువ కాలం విషయాలను గుర్తుంచుకోవడానికి, వారు ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్ లకు అటెండ్ అవ్వండి. తద్వారా రాత పరీక్షలో టైమ్ మేనేజ్ మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది.
5) అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేవీ అగ్నివీర్ సిలబస్‌తో క్షుణ్ణంగా ఉండాలి, తద్వారా వ్రాత పరీక్షలో ఇండియన్ నేవీ అగ్నివీర్ కట్-ఆఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించడానికి ఇది వారికి సహాయపడుతుంది.
ఇలా ఒక ప్లాన్ ప్రకారం, ప్రిపరేషన్ టిప్స్, ఎగ్జామ్ రాసే సమయంలో తీసుకోవాల్సిన టిప్స్ ను పాటిస్తే.. ఇండియన్ నేవీ అగ్నివీర్ పరీక్షలో సులభంగా గట్టెక్కవచ్చు. ఎక్కువ మార్కులు సాధించి మిగిలిన రౌండ్లకు క్వాలిఫై కావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Agniveer, Army, Army jobs, Career and Courses, JOBS, Preparation