Home /News /jobs /

IF YOU READ THESE ONLINE COURSES YOUR FUTURE IS GOLDEN IN WHICH UNIVERSITY UMG GH

SPP University: ఈ ఆన్‌లైన్ కోర్సులను చదివారో .. మీ ఫూచర్ బంగారమే ! ఏ యూనివర్సిటీలో అంటే ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పూణే(Pune) కేంద్రంగా పనిచేసే సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీని (SPPU) ఆన్‌లైన్‌ క్రెడిట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సెల్ఫ్-లెర్నింగ్ ఫ్లాట్‌ఫాం SWAYAM (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్-లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్)లో ఈ కోర్సు(Course)లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
పూణే (Pune)కేంద్రంగా పనిచేసే సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీని (SPPU) ఆన్‌లైన్‌ క్రెడిట్(Credit) కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఈ విద్యాసంస్థను పూణే వర్సిటి అని కూడా పిలుస్తారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సెల్ఫ్-లెర్నింగ్ ఫ్లాట్‌ఫాం SWAYAM (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్-లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్)లో ఈ కోర్సు(Course)లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందు కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ swayam.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31గా నిర్ణయించారు. ఈ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికేట్‌ పొందవచ్చు. అయితే విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన కచ్చితమైన తేదీలు ఇంకా వెలువడలేదు.

అందుబాటులో ఉన్న కోర్సులు
ఫండమెంటల్స్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ మెథడ్స్, ఇండియన్ క్లాసిక్ డ్యాన్స్ కథక్, మైక్రో ఎకనామిక్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఇతర కోర్సులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ స్వయంలో అందుబాటులో ఉన్నాయి. కోర్సు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు వీడియో లెక్చర్స్, ఇతర సంబంధిత కంటెంట్‌లను చూడవచ్చు. విద్యార్థులు ప్రతి వారం అసైన్‌మెంట్‌లను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే క్విజ్‌లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న విద్యార్థులు, 20 శాతం కోర్సును ఆన్‌లైన్ లో పూర్తి చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిఫారస్సు చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిగ్రీ విద్యార్థులకు పూణే యూనివర్సిటీ కోరింది.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 ఈనెల ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ ఫలితాలను సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో ప్రకటించింది. పూణే యూనివర్సిటీ రిజల్డ్స్ -2022లో విద్యార్థి ఓవరాల్ గ్రేడ్స్, అప్లికేషన్ ఐడీ, కేటగిరి, కోర్సు పేరు, ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. మెరిట్ లిస్ట్‌ను పూణే యూనివర్సిటీ త్వరలో విడుదల చేయనుంది. కనీస కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులు కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తారు. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది పూణె యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష జూలై 21 నుంచి 24 వరకు జరిగిన సంగతి తెలిసిందే.ఎడ్యుకేషన్ రంగంలో యాక్సెస్, ఈక్విటీ, నాణ్యతను సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వయం(SWAYAM)ను ప్రారంభించింది. అందరితో పాటు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా బెస్ట్ లెర్నింగ్ రిసోర్స్ కల్పించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. వివిధ సబ్జెక్టులపై ప్రతి సెమిస్టర్‌లో కంప్యూటర్ ఆధారిత మోడ్‌ లేదా హైబ్రిడ్ మోడ్‌, పేపర్ పెన్ మోడ్‌లో పరీక్షలు నిర్వహించి, ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను డెలివరీ చేస్తుంది. జనవరి 2022 సెమిస్టర్ కోసం 348 కోర్సులకు సంబంధించిన స్వయం పరీక్షలను నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, Online course, University

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు