హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Groups Preparation Tips: TSPSC Groups ప్రిపరేషన్ విధానం.. ఇలా ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి..

Groups Preparation Tips: TSPSC Groups ప్రిపరేషన్ విధానం.. ఇలా ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కాగా.. దీనిలో కొన్ని రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఇంకా గ్రూప్ 2,3,4 లాంటి నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కాగా.. దీనిలో కొన్ని రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఇంకా గ్రూప్ 2,3,4 లాంటి నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.  అయితే ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయి.. మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా అనౌన్స్ చేశారు. ఇలా మొత్తం గ్రూప్ 1, 2, 3, 4 నోటఫికేషన్లకు సంబంధించి పరీక్షలు జరగున్నాయి. అయితే వీటిలో.. అన్ని నోటిఫికేషన్లకూ సంబంధించి ఎలా ప్రిపేర్‌ అవ్వాలి.. అన్నింటికి ఒకేలా సన్నద్ధం కావాలా..? లేదా ఏదో ఒక దాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాని కోసమే సన్నద్ధమవ్వాలా అనే సందిగ్ధతలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా.. గ్రూప్ 2, 3, 4 పరీక్షలు జరగాల్సి ఉంది. దీనిలో గ్రూప్ 4 పరీక్షను జూలై 01న నిర్వహించనున్న విషయం విధితమే.  ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు.. మెయిన్స్ కోణంలో ప్రిపరేషన్ సాగిస్తే.. గ్రూప్ 2, 3, 4 పరీక్షలు కూడా సులువుగా ఉంటాయి. కాకపోతే.. గ్రూప్ 1 ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లే వారు.. ప్రతి రోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మంచింది.

గ్రూప్‌-2 ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు గ్రూప్‌ 3, 4కి కూడా దరఖాస్తు చేసుకుంటారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వారు.. గ్రూప్ 3 పరీక్ష కూడా సలువుగా ఉంటుంది. అయితే.. గ్రూప్ 4 లో సెక్రటేరియట్‌ ఎబిలిటీస్‌ పరీక్ష పేపర్ ను సపరేట్ కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే గ్రూప్‌-2 ప్రిపరేషన్‌పై అధిక దృష్టి పెట్టటం.. మిగతా నోటిఫికేషన్లను ఎదుర్కొనే వ్యూహాన్ని అనుసరించటం నిస్సందేహంగా సరైన నిర్ణయం అవుతుంది.

గ్రూప్‌-3, 4లకు మాత్రమే సిద్ధపడదాం అనుకునేవాళ్లు సిలబస్‌ ఒకటే కాబట్టి గ్రూప్‌-2 స్థాయిలో ప్రిపేర్‌ అయితే గ్రూప్‌-3 పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు. గ్రూప్ 3 పోస్టుల కోసం మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్లు.. గ్రూప్ 2, 4లను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది.

టీఎస్పీఎస్సీ నుంచి అత్యధిక ఖాళీలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయాగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ పోస్టులు కాకుండా.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో పోస్టులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఈ పోస్టులకు పోటీ విపరీతంగా ఉంది. మొత్తం దాదాపు 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్‌ ఉద్యోగాల ఆశావహులు మొదలైనవారు పెద్ద సంఖ్యలో పోటీ అభ్యర్థులుగా ఉన్నారు. అందుకే ప్రతి మార్కు అత్యంత విలువైనదని గుర్తించాలి. ఏదో ఒక జాబ్ కొట్టాలి అని అనుకునే వారంతా ఈ గ్రూప్ 4 ఉద్యోగాలే మెయిన్ టార్గెట్ గా మారుతాయి. కాబట్టి.. చదివిన పుస్తకాలను .. మళ్లీ మళ్లీ రిపీట్ చేసుకుంటూ చదువుకోవాలి.

IGNOU Admissions: ఇగ్నో అడ్మిషన్స్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

గ్రూప్ 4 టార్గెట్ అనుకుంటే.. గ్రూప్ 2, 3 లాంటి పోస్టులకు వెళ్లకపోవడం మంచిది. గ్రూప్ 4 లో రెండు పేపర్లే ఉంటాయి కాబట్టి.. సులువుగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ లో వచ్చిన ప్రశ్నల సరళి సివిల్స్ ను మించి ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని సబ్జెక్ట్ పై లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ చరిత్ర- సంస్కృతి, కళలు, సాహిత్యం, తెలంగాణ పాలన విధానాలు, పథకాలు, తెలంగాణ జాగ్రఫీ, సొసైటీ, తెలంగాణ ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలు సిలబస్‌లో ఉన్నందున ఆయా విషయాలపై గట్టి పట్టు సాధించటం ద్వారా అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు పొందవచ్చు.

First published:

Tags: JOBS, Preparation tips, TSPSC, Tspsc jobs