Home /News /jobs /

IF YOU PREPARE AS MENTIONED BELOW FOR TELUGU PANDIT POSTS THEN YOU CAN GET SCHOOL ASSISTANT JOB NZB VB

Telugu Pandit Preparation Tips: తెలుగు పండిత్ పోస్టుల కోసం.. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

గ్రేడ్ 2 తెలుగు ప‌డింత్(Grade 2 Telugu Pandit) అనేది గతంలో ఉండేటువంటి పేరు.. ప్రస్తుతం లాంగ్వేజ్ పండిత్  పేరుతో పిలుస్తున్నారు. BA తెలుగు, MA తెలుగు తో పాటు. .. బీఈడీ లో తెలుగు సెంక‌డ్ మెథడాలజీ(Methodology) చ‌దివిన వారు.. తెలుగు పండిట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను రాయవచ్చు. దీంతో పాటు.. టెట్ అర్హత తప్పనిసరి.

ఇంకా చదవండి ...
    (P. Mahender, News 18, Nizamabad)

    గ్రేడ్ 2 తెలుగు ప‌డింత్(Grade 2 Telugu Pandit) అనేది గతంలో ఉండేటువంటి పేరు., ప్రస్తుతం లాంగ్వేజ్ పండిత్  పేరుతో పిలుస్తున్నారు. BA తెలుగు, MA తెలుగు తో పాటు. .. బీఈడీ లో తెలుగు సెంక‌డ్ మెథడాలజీ(Methodology) చ‌దివిన వారు.. తెలుగు పండిట్ ట్రైనింగ్(Pandit Training) చేసినటువంటి వాళ్లు.. లాంగ్వేజ్ పండిత్ పరీక్ష రాయడానికి అర్హులని స్కూల్ అసిస్టెంట్ అయిన తెలుగు పండిట్ వారే దస్తగిరి చెబుతున్నారు. టెట్లో పేపర్-2 క్వాలి ఫై అయిన వాళ్ళు అందరూ కూడా లాంగ్వేజ్ పండిత్, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం(School Assistant Job) చేయడానికి అర్హత సంపాదిస్తారన్నారు. గతంలో 2012 సంవత్సరం కంటే ముందు సిలబస్ చాలా తక్కువగా ఉండేది.. కంటెంట్ కేవలం ప్రభుత్వ పుస్తకాలు చదువుకుంటే సరిపోయేది. కానీ.. 2012 డీఎస్సీ నుండి సిలబస్ చాలా పెంచారు.

    SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


    జాతీయ పరీక్ష నెట్ తరహాలో లాంగ్వేజ్ పండట్ కి పెంచడం జరిగింది. అయితే  స్కూల్ అసిస్టెంట్ తో పోలిస్తే లాంగ్వేజ్ పండిట్ కి మూడు యూనిట్లు సిలబస్ తక్కువగా ఉంటుంది. మిగతా ఎనిమిది యూనిట్లు వారికి వీరికి సేమ్ ఉన్నప్పటికీ లాంగ్వేజ్ పండిట్ లకు ప్రశ్నల కాఠిన్యతలో కొంచెం పరిమాణం తక్కువగా ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్ సిలబస్ చాలా తక్కువ అంటే చదివిన పుస్తకాన్ని మళ్ళీ మళ్లీ చదివితే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. సిలబస్ విషయానికి  వస్తే 20 మార్కులు జనరల్ నాలెడ్జ్.. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ దానికి కేటాయిస్తే... తెలుగు కి మిగతా 60 మార్కులు కేటాయిస్తారు. 60 మార్కుల్లో కంటెంట్ కి 44 మార్కులు. మెథడాలజీ కి 16 మార్కులు ఉంటాయి.



    కంటెంట్ లో ఎనిమిది యూనిట్లు ఇచ్చారు. ఈ ఎనిమిది యూనిట్లు గతంలో కేవలం పాఠ్యపుస్తకాల ఆధారంగా ప్రశ్నలు ఇచ్చేటటువంటి వారు..  ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవుల గురించి సమగ్ర సమాచారం.. ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర సమాచారం.. కవిత రీతులకు సంబంధించిన సమగ్ర సమాచారం చదువు కోవాల్సిన అవసరం ఉంది. లోతైన‌  ప్రశ్నలు అడుగుతున్నారు.. ఈ విషయాన్ని గమనించి ప్రణాళికా ప్రకారం ముందుకు సాగాలన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎన్నో పుస్తకలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనిఅనుకుంటే పింగళి లక్ష్మీకాంతం గారు రాసిన ఆంధ్ర సాహిత్య చరిత్ర.. డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రాసిన ఆధునికాంధ్ర కవిత్వం.. సాంప్రదాయాలు.. చదువుకుంటే సరిపోతుందన్నారు.

    SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


    ఇన్ని పుస్తకాలు చదవలేను   టైం తక్కువగా ఉంది అని అనుకునేవారు ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రింట్ చేసినటువంటి రెడీమేడ్ పుస్తకాలు కొనుక్కుంటే సరిపోతుందన్నారు. పదో తరగతి వరకు ఉన్నటువంటి అలంకారాలు ఛందస్సు వ్యాకరణం నేర్చుకుంటే సరిపోతుందన్నారు. పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలి అని అంటే బాల వ్యాకరణం కానీ.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి వ్యాకరణ గ్రంథం కానీ.. డాక్టర్ డి సామ మూర్తి గారు రాసినటువంటి వ్యాకరణ మంజూష చదువుకుంటే మంచిదన్నారు. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలల సమయం ఉంటుంది.

    Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


    ఈ పుస్తకాలను తీసి అధికారికంగా ఉన్నటువంటి పుస్తకాలని మనం అధ్యయనం  చేస్తే రేపు పొద్దున ఈ ఉద్యోగం తో పాటు  ఇంకా జేఎల్ గానో డి ఎల్ గా నెట్ క్వాలిఫై  అయ్యి మంచి మంచి పోస్టుల లోకి వెళ్లే అవకాశం ఉంది.. మాకు ఇంకా సమయం లేదు అని అనుకుంటున్న టువంటి వాళ్లే ప్రైవేట్ పబ్లిషర్స్ మీద ఆధారపడండి.. తెలుగు ఉపాధ్యాయ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వారు ప్రణాళికతో చదివి తెలుగు ఉపాధ్యాయునిగా స్థిరపడాలని ఆకాంక్షించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, JOBS, Pandit, Telugu language

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు