Home /News /jobs /

IF YOU FOLLOW THE INSTRUCTIONS GIVEN HERE TO GET 60 MARKS IN TELANGANA SI EXAM THEN YOU CAN QUALIFY VB

SI Exam Last Minutes Tips: పరీక్ష హాల్లో ఇలా ప్లాన్ చేసుకుంటే.. 60 మార్కులను ఈజీగా తెచ్చుకోవచ్చు..

SI Exam Last Minutes Tips: పరీక్ష హాల్లో ఇలా ప్లాన్ చేసుకుంటే.. 60 మార్కులను ఈజీగా తెచ్చుకోవచ్చు.. (Image :  I Stock)

SI Exam Last Minutes Tips: పరీక్ష హాల్లో ఇలా ప్లాన్ చేసుకుంటే.. 60 మార్కులను ఈజీగా తెచ్చుకోవచ్చు.. (Image : I Stock)

తెలంగాణ ఎస్ఐ , కానిస్టేబుల్ కొలువుల జాతర మొదలైన విషయం తెలిసిందే. 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం ప్రకటన మేరకు 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
తెలంగాణ ఎస్ఐ(SI) , కానిస్టేబుల్ (Constable) కొలువుల జాతర మొదలైన విషయం తెలిసిందే. 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను(Government Jobs) భర్తీ చేస్తామన్న సీఎం ప్రకటన మేరకు 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తికాగా.. రేపు (ఆగస్టు 7)న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను(Preliminary) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 93937 11110/93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇంకా.. support@tslprb.in కు వివరాలు పంపి పరిష్కారం పొందొచ్చు.

RRB Group D Update: రైల్వే గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ D పరీక్షలపై తాజా అప్ డేట్..

అయితే.. దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఇందు కోసం గ్రేటర్ పరిధిలో 503 ఎగ్జామ్ సెంటర్లు, రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రిలిమ్స్ పరీక్షలో ఈ సారి నెగెటివ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తప్పు సమాధానానికి 0.25 మార్కులను కోల్పోతారు. దీంతో అభ్యర్థుల్లో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. 60 మార్కులు సాధించిన వారికి మాత్రమే తదుపరి పరీక్షలకు అనుమతి ఉంటుది.



ఇచ్చిన మూడు గంటల వ్యవధిలో మొదట 100 మార్కులకు రీజనింగ్ అండ్ అరిథమేటిక్ లో ప్రశ్నలు ఇస్తారు. మిగతా 100 మార్కులకు కరెంట్ అఫైర్స్ తో పాటు.. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలును అడుగుతారు. అయితే పరీక్ష హాల్లోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రీజనింగ్ పార్ట్ చేస్తే.. టైమ్ తీసుకున్నా ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఒక గంట వరకు రీజనింగ్ పార్ట్ కు.. సమయం కేటాయించిన తర్వాత ఒకసారి పేపర్ అంతా ఒక్కసారి చదువుకుంటూ వెళ్లాలి. వచ్చిన బిట్స్ ను బబుల్ చేసుకుంటూ వెళ్లాలి. మిగిలిన సమయాన్ని మ్యాథ్స్ బిట్స్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా పక్కా కరెక్ట్ అని పించిన ప్రశ్నలు ఎన్ని బబుల్ చేశారో చూసుకోండి.

స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ బుక్స్ పై ఓ లుక్కేయండి..

45 మార్కుల కంటే తక్కువగా వస్తున్నాయంటే.. ధైర్యం చేసి 200 ప్రశ్నలకు సమాధానాలు పెట్టడం మంచింది. 155 ప్రశ్నలకు సమాధానలు గుర్తిస్తే.. నెగెటివ్ మార్కలు పోయినా.. కనీసం 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 50 నుంచి 60 మార్కుల మధ్యలో స్కోర్ వస్తుందంటే.. జగ్రత్తగా ఉండాలి. ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు అనిపిస్తున్న వాటికి ధైర్యం చేసి.. ఏదో ఒక సమాధానాన్ని గర్తించడం మంచిది. ఇలా చేస్తే మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. 60 నుంచి 70 మార్కులు పక్కా కరెక్ట్ అనిపిస్తే.. వేరే ప్రశ్నల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. చివరకు రీజనింగ్ బిట్స్ సింపుల్ గా ఉంటాయి కావునా.. వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టండి 50 మార్కులకు 40 మర్కులకు పైగా స్కోర్ సాధించవచ్చు. మిగతా 20 మార్కులకు కరెంట్ అఫైర్స్, తెలంగాణ బిట్స్ కు సంబంధించి మీ అవగాహన మేర గుర్తిస్తే.. 60 మార్కలు దాటేయొచ్చు. ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు న్యూస్ 18 తెలుగు తరఫున ఆల్ ది బెస్ట్.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Police jobs, Si exam, Telangana Police, Telangana police jobs

తదుపరి వార్తలు