హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Architecture: ఆర్కిటెక్చర్‌లో 3D మోడలింగ్, సిమ్యులేషన్‌ స్పెషలైజేషన్స్.. ఇది బెస్ట్ కెరీర్ ఆప్షన్

Architecture: ఆర్కిటెక్చర్‌లో 3D మోడలింగ్, సిమ్యులేషన్‌ స్పెషలైజేషన్స్.. ఇది బెస్ట్ కెరీర్ ఆప్షన్

Architecture: ఆర్కిటెక్చర్‌లో 3D మోడలింగ్, సిమ్యులేషన్‌ స్పెషలైజేషన్స్.. ఇది బెస్ట్ కెరీర్ ఆప్షన్

Architecture: ఆర్కిటెక్చర్‌లో 3D మోడలింగ్, సిమ్యులేషన్‌ స్పెషలైజేషన్స్.. ఇది బెస్ట్ కెరీర్ ఆప్షన్

Architecture: ప్రస్తుతం ఇండియాలో కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ది చెందుతోంది. దీంతో కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను సమర్థవంతంగా రూపొందించగల, చూపించగల ఆర్కిటెక్ట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో దాదాపు అన్ని రంగాల్లో టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ (Technology Advancement)తో కొత్త ఉద్యోగాలు (New Jobs) పుట్టుకొస్తున్నాయి. మార్కెట్‌ ట్రెండ్‌కి తగినట్లు స్కిల్స్‌ డెవలప్‌ చేసుకున్న వారికి అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ది చెందుతోంది. దీంతో కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను సమర్థవంతంగా రూపొందించగల, చూపించగల ఆర్కిటెక్ట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది.

నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్‌లకు ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధితో ఆర్కిటెక్ట్‌ల పాత్ర ట్రెడిషినల్‌ డ్రాయింగ్, డిజైనింగ్‌కు మించి పెరిగింది. 3D మోడలింగ్, సిమ్యులేషన్‌ వంటి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. క్లయింట్‌లకు డిజైన్స్ చూపించడానికి, పొటెన్షియల్‌ ప్రాబ్లమ్స్ గుర్తించడానికి, కన్‌స్ట్రక్షన్‌ డీటైల్డ్ ప్లాన్‌లు రూపొందించడానికి ఈ మోడల్స్‌ ఉపయోగిస్తారు. ప్రతి ఆర్కిటెక్చరల్ ఆఫీస్‌కు 3D యానిమేషన్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్చర్‌లో 3D మోడలింగ్, సిమ్యులేషన్‌ చేసిన వారి కెరీర్‌ ఎలా ఉంటుంది, జీతాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.

* కెరీర్ అవకాశాలు

ఇటీవల కాలంలో ఇండియన్ కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీలో 3D మోడలింగ్, సిమ్యులేషన్ వినియోగం పెరిగింది. స్మార్ట్ సిటీలు, సస్టైనబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో ఈ టెక్నాలజీలకు డిమాండ్‌ పెరిగింది. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM) టెక్నాలజీ కూడా ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతోంది. భారతదేశంలో 3D మోడలింగ్, సిమ్యులేషన్‌లో ఆర్కిటెక్ట్‌లకు కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ సంస్థలు, ఇంజనీరింగ్ సంస్థలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, వీడియో గేమ్, మూవీ ప్రొడక్షన్ స్టూడియోలలో కూడా ఆర్కిటెక్ట్‌లు పని చేయవచ్చు.

ఇది కూడా చదవండి : ఇండియాలో 45,000 AI ఉద్యోగాలు .. రూ.45 లక్షల వరకు జీతం!

ఆర్కిటెక్ట్ 3D మోడలింగ్, సిమ్యులేషన్‌లో బిల్డింగ్స్‌, ప్రకృతి దృశ్యాల రియలిస్టిక్‌ మోడల్‌ను రూపొందించాలి. వీడియో గేమ్స్, మూవీస్ కోసం వర్చువల్ ఎన్విరాన్‌మెంట్స్‌ను క్రియేట్‌ చేయాలి. 3D మోడలింగ్, సిమ్యులేషన్‌లో కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కెరీర్ వృద్ధికి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఈ రంగంలో ఎక్స్‌పీరియన్స్‌ పెరిగే కొద్దీ ఆర్కిటెక్ట్‌లు 3D మోడలర్స్‌, BIM మేనేజర్స్‌, ప్రాజెక్ట్ మేనేజర్స్‌, డైరెక్టర్స్‌గా కూడా మారవచ్చు.

* అవసరమైన విద్యార్హతలు

3D మోడలింగ్, సిమ్యులేషన్ నాలెడ్జ్‌తో ఆర్కిటెక్చర్‌లో వృత్తిని కొనసాగించడానికి వివిధ ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్ అవసరం. 3D విజువలైజర్ కావడానికి, గ్రాఫిక్ డిజైన్ లేదా ఇంటీరియర్ డిజైన్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ డిగ్రీ (BDes) చేసి ఉండాలి. లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు. సివిల్ ఇంజినీరింగ్ లేదా బీఆర్క్‌ కోర్సుల్లో బీటెక్‌ పూర్తి చేసిన వారు కూడా అర్హులు.

మాస్టర్స్ డిగ్రీ స్థాయిలో, భారతదేశంలో డిజైన్ కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEED) రాయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులు. ఈ జాతీయ ప్రవేశ పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)తో సమానంగా ఉంటుంది. IIT-ఢిల్లీ, IIT-బాంబే, NIFT అండర్ గ్రాడ్యుయేట్ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు గ్రాడ్యుయేట్ స్థాయిలలో డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. 3DS Max, V-Ray, Rhino, Maya, SketchUp వంటి 3D సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధించడం ముఖ్యం.

* ఆర్కిటెక్చర్‌లో 3D మోడలర్స్‌ జీతం

కెరీర్ వృద్ధి అవకాశాలతో పాటు, 3D మోడలింగ్, సిమ్యులేషన్‌లో పనిచేసే ఆర్కిటెక్ట్‌లు ఎక్కువ జీతాలను ఆశించవచ్చు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రారంభ స్థాయిలో, 3D విజువలైజర్‌లు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు సంపాదిస్తారు. ఎక్స్‌పీరియన్స్‌ పొందిన తర్వాత నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు వరకు సంపాదించవచ్చు. BIM మేనేజర్ సంవత్సరానికి రూ.9 లక్షల వరకు సంపాదించవచ్చు.

First published:

Tags: CAREER, Career and Courses, EDUCATION, JOBS