IF THE RESUME IS LIKE THIS YOU ARE GUARANTEED A JOB UMG GH
Powerful Resume: రెజ్యూమ్ ఇలా ఉంటే.. మీకు ఉద్యోగం గ్యారెంటీ ..!
మంచి రెజ్యూమ్ ఇలా తయారు చేసుకోవాలి.
రెజ్యూమ్బ( Resume)లంగా ఉంటే, ఉద్యోగం పొందే అవకాశం మెరుగుపడుతుందని నిపుణులు( Experts) చెబుతుంటారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రెజ్యూమ్ అంటే ఏంటి? ఇందులో పొందుపర్చాల్సిన అంశాలు ఏవి? వంటి విషయాలు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ఏ ఉద్యోగాని (Job)కైనా రెజ్యూమ్ (Resume) అనేది ఒక ప్రధాన అవసరంగా మారింది. పెద్ద స్థాయి ఉద్యోగాలతో పాటు నామమాత్రపు విద్యార్హతలతో చేపడుతున్న నియామకాలకు కూడా రెజ్యూమ్ తప్పనిసరిగా మారింది. అయితే రెజ్యూమ్ బలంగా ఉంటే, ఉద్యోగం పొందే అవకాశం(Opportunities) మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రెజ్యూమ్ అంటే ఏంటి? ఇందులో పొందుపర్చాల్సిన అంశాలు ఏవి? వంటి విషయాలు తెలుసుకుందాం.
రెజ్యూమ్ అనేది.. ఒక అభ్యర్థి తమకు అవసరమని రిక్రూటర్‌ను ఒప్పించే అన్ని కోణాలను కలిగి ఉండే డాక్యుమెంట్. మీ రెజ్యూమ్ నిర్ణయాత్మకంగా, ప్రత్యేకంగా(Special) ఉందని నిర్ధారించుకోవడానికి ఈ డాక్యుమెంట్లో చేర్చాల్సినవి కొన్ని ఉన్నాయి:
1. ప్రాజెక్టులు, వాటి ప్రభావాన్ని స్పష్టంగా పేర్కోవాలి. అయితే ప్రాముఖ్యతలను అతిగా చెప్పకండి. వాటిని వాస్తవికంగా వివరించండి.
2. మీ నైపుణ్యాలను పేర్కొనండి. మీరు టెక్నికల్‌గా ఎలా డెవలప్ అయ్యారనే వివరాలను నిర్దిష్ట సంఘటనల ద్వారా పొందుపర్చండి. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను ప్రతిబింబించే నైపుణ్యాలను హైలైట్ చేయండి.
3. రెజ్యూమ్‌లో మోసపూరిత, తప్పుడు వివరాలకు చోటు ఇవ్వొద్దు. ఇలా చేస్తే, మీరు రిక్రూట్ అయినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రెజ్యూమ్ అనేది జాబ్‌కు యాక్సెస్ అని గుర్తుంచుకోవాలి. రిక్రూటర్‌కు మీ రెజ్యూమ్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉంటుంది. కాబట్టి సమర్థవంతమైన, ప్రభావవంతమైన రెజ్యూమ్‌ను రూపొందించాలి. అలాగే ఉదాహరణలు, డేటాతో పాటు మీ ఆప్టిట్యూడ్స్ హైలైట్ చేయడం మంచిది. పవర్ఫుల్ రెజ్యూమ్ నిర్మాణాత్మక ఇంటర్వ్యూ ప్రక్రియకు బాటలు వేస్తుంది. మంచి రెజ్యూమ్‌తో ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు, రిక్రూటర్ ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశం రెండు లేదా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అన్ని కీలకమైన ఫీచర్లతో కూడిన చక్కటి, నిర్మాణాత్మక రెజ్యూమ్.. అభ్యర్థి వ్యక్తిత్వం, ఉద్యోగం పట్ల నిబద్ధత, భవిష్యత్తు కెరీర్ కోసం సంసిద్ధతను ప్రతిబింబిస్తుంది.
కంపెనీకి ఎవరి అవసరం ఉంటుంది, ఎవరు నిర్ణీత జాబ్‌కు సరిపోరనేది రెజ్యూమ్ ఆధారంగానే హైరింగ్ మేనేజర్లు నిర్ణయిస్తారు. అంటే ఈ పేపర్ షీట్ లేదా PDF డాక్యుమెంటే కంపెనీ విధిని నిర్ణయించగలదు. అయితే రెజ్యూమ్‌లో చాలా ముఖ్యమైనది ఒకటి ఉంటుంది. అభ్యర్థి తమ జాబ్ రోల్‌ను ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది హైరింగ్ మేనేజర్లు ప్రధానంగా చూస్తారు. రెజ్యూమ్ని పరిశీలించడానికి వీరికి ఎక్కువ సమయం లేనప్పుడు.. అభ్యర్థుల్లో ఈ సామర్థ్యాన్ని కొన్ని విషయాల ద్వారా రాబడతారు. అవేంటంటే..
1. ఇంటర్వ్యూయర్లు అభ్యర్థి ఆలోచనల్లో స్పష్టతను గౌరవిస్తారు. తదుపరి రౌండ్‌కు చేరుకునే అభ్యర్థులలో 43% మంది అలాంటి రెజ్యూమ్‌లను కలిగి ఉంటారని నివేదికలు చెబుతున్నాయి.
2. వివరణాత్మక రెజ్యూమ్ అభ్యర్థి విశ్వాసాన్ని పెంచుతుంది. దీని ద్వారా ఇంటర్వ్యూయర్‌ను అభ్యర్థి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఎంగేజ్ చేయవచ్చు. ఇది అభ్యర్థి విజయాన్ని 71 శాతం వరకు పెంచుతుంది.
3. కాంప్లిమెంటరీ స్ట్రక్చర్ మరో కీలక విషయం. మీరు మ్యానజీరియల్ పొజిషన్‌కు దరఖాస్తు చేస్తుకుంటే.. మీకు మేనేజ్మెంట్ లేదా లీడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉదాహరణకు కాలేజీ క్లబ్ మేనేజర్, ఫుట్‌బాల్ కెప్టెన్ లేదా సమానమైన రోల్స్‌లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు లీడర్షిప్ క్వాలిటీస్, సంబంధిత అనుభవం ఉన్నాయనేది ఇది సూచిస్తుంది. ఇలాంటి సంఘటనలను పేర్కొనడం వల్ల మీ సెలక్షన్ అవకాశాలు పెరుగుతాయి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.